నింగిలోకి పిఎస్ఎల్వీ సీ32: వాహనాల గమనం నిర్దేశిస్తుంది

శ్రీహరికోట: దిశా నిర్దేశ వ్యవస్థకు సంబంధించిన ఆరో ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం నాడు ప్రయోగించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు పిఎస్ఎల్వీ సీ32 వాహకనౌకను నింగిలోకి పంపింది.

44.4 మీటర్ల పొడవు, 1,425 కేజీల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ - 1ఎఫ్‌ అనే ఉపగ్రహాన్ని తీసుకెళ్లి నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టనుంది. రెండో దశ విజయవంతం, స్వదేశీ నావిగేషన్ వ్యవస్థలో ఇది ఆరో ఉపగ్రహం. ఇది విపత్తుల సమయంలో బాధితులకు సహాయంగా ఉండనుంది.

PSLV-C32 lifts off with navigation satellite IRNSS-1F

విమానాలు, ఓడల గమనాన్ని ఈ ఉపగ్రహం నిర్దేశించనుంది. వాహనాల గమనాన్ని పర్యవేక్షించడంలో ఉపయోగపడనుంది. భూతల, ఆకాశ, సాగరాల్లో ఇది దిశా నిర్దేశనం చేయనుంది. 12 ఏళ్ల పాటు ఇది పని చేయనుంది. పిఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 52వ ప్రయోగం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది.

రాకెట్ నింగికెగసిన 108వ సెకనులో తొలిదశ విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+