Viral Video: డ్రగ్స్ కేసులో సాధువును ఇరికించే కుట్ర.. సీక్రెట్ కెమెరాలో అడ్డంగా దొరికిన పోలీస్!

Viral Video: పంజాబ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఒక ఘటనలో పోలీసులు కల్పించిన అక్రమ కేసు కుట్ర సీక్రెట్ కెమెరా ఆధారాల ద్వారా బయటపడింది. లుధియానా జిల్లా ఖన్నా పట్టణంలో ఉన్న ఓ హిందూ సాధువు ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయంటూ అక్రమంగా కేసు నమోదు చేసేందుకు యత్నంచిన పంజాబ్ పోలీసుల ప్లాన్ సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఖన్నా సీఐఏ విభాగంలో పనిచేస్తున్న ఏఎస్సై సుఖ్‌దేవ్ సింగ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.

Viral Video: డాక్టర్‌తో మాట్లాడుతుండగానే పేలిన ఫోన్.. పసిపిల్లలున్న క్లినిక్‌లో హైటెన్షన్!
Viral Video: డాక్టర్‌తో మాట్లాడుతుండగానే పేలిన ఫోన్.. పసిపిల్లలున్న క్లినిక్‌లో హైటెన్షన్!

ఈ వివాదం ఖన్నా పట్టణంలోని మహంత్ కాశ్మీర్ గిరి నివాసంలో జరిగిన పోలీస్ దాడి చుట్టూ తిరుగుతోంది. కాశ్మీర్ గిరి వద్ద పనిచేసే డ్రైవర్ గుర్జంత్ సింగ్ అలియాస్ జంటా వద్ద 7.5 గ్రాముల హెరాయిన్ దొరికినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడిని విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగానే మహంత్ ఇంట్లో తనిఖీలు చేపట్టామని పోలీసులు ప్రకటించారు. అనంతరం మహంత్ మంచం పరుపు కింద నుంచి 30 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని చెబుతూ.. అతడిని డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ చేశారు.

Punjab Viral Video Police Caught Planting Drugs at Sadhu House Suspended After CCTV Footage Details

అయితే మత పెద్ద నివాసంలో ఏర్పాటు చేసిన రహస్య కెమెరా ఫుటేజ్ వెలుగులోకి రావడంతో పోలీసుల అసలు రంగు బయటపడింది. పోలీస్ బృందం లోపలికి రాకముందే ఏఎస్సై సుఖ్‌దేవ్ సింగ్ సాధారణ దుస్తుల్లో గదిలోకి ప్రవేశించడం వీడియోలో కనిపించింది. ఆయన రహస్యంగా ఒక డ్రగ్స్ ప్యాకెట్‌ను పరుపు కింద దాచినట్లుగా వీడియో ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాతి క్షణాల్లోనే పోలీస్ బృందం మహంత్‌తో సహా గదిలోకి వచ్చి ఏఎస్సై ప్యాకెట్ ఉంచిన స్థలం నుంచే హెరాయిన్ దొరికినట్లు నాటకం ఆడారు.

మరో బిగ్ మల్టీస్టారర్‌.. ఇద్దరు స్టార్ హీరోలతో మణిరత్నం బిగ్ సర్‌ప్రైజ్!
మరో బిగ్ మల్టీస్టారర్‌.. ఇద్దరు స్టార్ హీరోలతో మణిరత్నం బిగ్ సర్‌ప్రైజ్!

వీడియో సాక్ష్యాలు బయటకు రావడంతో ఖన్నా ఎస్ఎస్పీ దర్పణ్ అహ్లువాలియా వెంటనే స్పందించి ఏఎస్సై సుఖ్‌దేవ్ సింగ్‌ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. అలాగే అక్రమంగా అరెస్ట్ అయిన మహంత్ కాశ్మీర్ గిరిని కేసు నుంచి విడుదల చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఎస్పీ ర్యాంక్ అధికారి నాయకత్వంలో సిట్(ప్రత్యేక విచారణ బృందం) ఏర్పాటు చేశారు.

ఈ ఘటనతో పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సోషల్ మీడియా వేదికగా సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పంజాబ్ పోలీసులు పౌరులను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ఇంటింటికీ డ్రగ్స్ డెలివరీ చేస్తున్నారా అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+