Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rahul Gandhi: పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ..

పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధించింది. సూరత్ కోర్టు తీర్పుపై మంగళవారం రాహుల్ గాంధీ(Rahul Gandhi) గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించాలని హైకోర్టును కోరారు. రాహుల్ గాంధీ 2019 కర్టాటకలో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మోడీ ఇంటి పేరు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మార్చి 23న రాహుల్ గాంధీ దోషిగా తేలుస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పిల్ చేసుకునేందుకు నెల రోజుల సమయం కూడా ఇచ్చింది.

రాహుల్ గాంధీ తన శిక్షను నిలుపుదల చేయాలంటూ రాహుల్ గాంధీ చేసిన విజ్ఞప్తిని సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది. దీంతో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు. "సూరత్ కోర్టు ఇటీవలి తీర్పును సవాలు చేస్తూ మేము ఈ రోజు గుజరాత్ హైకోర్టులో దరఖాస్తు చేశాము" అని రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది పంకజ్ చంపనేరి తెలిపారు. సూరత్ కోర్టు రాహుల్ ను దోషిగా తేల్చడంతో అతనిపై లోక్ సభ సెక్రటెరియట్ అనర్హత వేటు వేసింది. ప్రజాప్రతినిధుల చట్టం, 1951 (RP చట్టం) ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఏదైనా నేరానికి శిక్ష విధించబడిన ఎన్నికైన ప్రజాప్రతినిధి తక్షణం అనర్హతను ఎదుర్కొంటారు.

Rahul Gandhi

అనర్హత నుంచి మూడు నెలల రక్షణ కల్పించే చట్టంలోని ఒక నిబంధనను 2013లో సుప్రీంకోర్టు "అల్ట్రా వైర్స్"గా కొట్టివేసింది. 2019లో కర్ణాటకలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ "దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది?" అని ప్రజలను అడిగారు. పరారీలో ఉన్న లలిత్ మోడీ, నీరవ్ మోడీలను ప్రస్తావిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. దీనపై గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేష్‌ మోడీ పరువు నష్టం కేసు వేశారు.

ఏప్రిల్ 22న లోక్‌సభకు అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఎంపీగా తనకు కేటాయించిన 12 తుగ్లక్ లేన్ ఇంటిని రాహుల్ గాంధీ ఖాలీ చేశారు. మోడీ ఇంటిపేరు పరువునష్టం కేసులో బీహర్ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై పాట్నా హైకోర్టు మే 15 వరకు స్టే విధించింది. 'మోడీ ఇంటిపేరు'పై రాహుల్ గాంధీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై 2019లో బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ పరువు నష్టం దావా వేశారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 12న హాజరుకావాలని పాట్నా దిగువ కోర్టు కాంగ్రెస్ నాయకుడిని కోరింది.

పరువు నష్టం కేసులో దిగువ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ గాంధీ ఏప్రిల్ 22 న పాట్నా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన పాట్నా హైకోర్టు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. పరువు నష్టం కేసు ఇప్పటికే సూరత్ కోర్టులో విచారణలో ఉన్నప్పుడు, అదే విషయంలో వేరే కోర్టులో మరో విచారణ సరికాదని కోర్టు పేర్కొంది. ఇది చట్టవిరుద్ధంమని పేర్కొంది. తదుపరి విచారణను మే 15కి వాయిదా వేయడంతో పాటు అప్పటి వరకు దిగువ కోర్టు విచారణలన్నీ నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+