Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మా భుజంపై తుపాకీ పెడతారా? రాహుల్ కు ఈసీ డెడ్ లైన్: మరో మార్గం లేదు

దేశంలో ప్రస్తుతం ఓట్ చోరీ ఉద్యమం నడుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రల్లో పెద్ద ఎత్తున ఓట్లను దొంగిలించారంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల అనంతరం ఈ మూమెంట్.. క్రమంగా ఊపందుకుంటోంది. దీనికి నిరసనగా కాంగ్రెస్, ఇండియా బ్లాక్ పార్టీలు రోడ్డెక్కుతున్నాయి.

ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. దేశ రాజధానిలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఏర్పాటైన ఈ ప్రెస్ మీట్ లో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఇతర కమిషనర్లు మాట్లాడారు. రాహుల్ గాందీకి సవాల్ విసిరారు.

Rahul Gandhi Faces Deadline Submit Proof or Apologize for Vote Chori Claims

రాహుల్ గాంధీ చేసిన 'ఓట్ చోరీ' ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీకి ఏడు రోజుల గడువు విధించారు. ఓట్ చోరీ ఆరోపణలకు రుజువుగా వారం రోజుల్లో అఫిడవిట్ సమర్పించాలని లేదా దేశానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఓట్ చోరీపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇవ్వాలి లేదా దేశానికి క్షమాపణ చెప్పాలని జ్ఞానేష్ కుమార్ తేల్చి చెప్పారు. ఆయనకు మరో మార్గం లేదని స్పష్టం చేశారు. తాము విధించిన ఈ వారం రోజుల్లోగా రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇవ్వకపోతే- ఆయన చేసిన ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

రుజువులు, సాక్ష్యాధారాలు లేనిదే ఇలాంటి ఆరోపణలు అన్నీ అవాస్తవాలేనని ఆయన పేర్కొన్నారు. ఓట్ చోరీ, డబుల్ ఓటింగ్‌కు సంబంధించిన ఆరోపణలన్నింటినీ కూడా కమిషనర్లు తీవ్రంగా ఖండించారు. ఇవి నిరాధారమైనవని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని పారదర్శకంగా విజయవంతం చేయడానికి చేస్తున్నామని పునరుద్ఘాటించారు.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు.. రాజ్యాంగాన్ని అవమానించినట్టేనని జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఓట్ చోరీ వంటి పదాలు ప్రజాస్వామ్య సంస్థలను అణగదొక్కుతాయని విమర్శించారు. ఎన్నికల సంఘాన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నాయని జ్ఞానేష్ కుమార్ ఆరోపించారు.

ఎన్నికల సంఘం భుజంపై తుపాకీ పెట్టి దేశ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నప్పుడు.. పేద, ధనిక, వృద్ధులు, మహిళలు, యువతతో సహా అన్ని వర్గాల ఓటర్లకు అండగా.. ఓ రక్షణ కవచంలా తాము నిలిచామని, ఇక ముందు కూడా నిల్చుంటామని వివరించారు.

డబుల్ ఓటింగ్ ఆరోపణలకు సంబంధించి, కొందరు ఓటర్లు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ- దీనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు కూడా వాళ్లు అందించలేదని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం గానీ, ఓటర్లు గానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలకు భయపడరని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మొత్తం 12 జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఓటర్ల జాబితా ముసాయిదాలోని లోపాలను సెప్టెంబర్ 1లోపు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆ తేదీ తర్వాత ఎలాంటి సవరణలు కూడా చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 1వ తేదీలోపు లోపాలను వెల్లడిస్తే- ఎన్నికల సంఘం వాటిని సరిదిద్దడానికి సిద్ధంగా ఉందని జ్ఞానేష్ కుమార్ చెప్పారు. ఆ తేదీ దాటితే సాధ్యం కాబోదని తేల్చి చెప్పారు. ఓటరు జాబితా సమగ్రతను కాపాడటంపై దృష్టి సారించామని అన్నారు.

ఒక ఓటరు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు ఒక్కసారి మాత్రమే ఈవీఎం బటన్ నొక్కగలడని గుర్తు చేశారు. ఓట్ చోరీ అనేది ఎప్పటికీ జరగదని, ఒక ఓటరు ఒక్కసారి మాత్రమే తన ఓటు వేయగలడని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, భద్రతపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+