రాష్ట్రం నాశనం కావడానికి ఎవరు కారణం, మండిపడిన యువరాజు రాహుల్ గాంధీ!
బెంగళూరు/న్యూఢిల్లీ: సుమారు 110 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జాతి వివాదాలతో అట్టుడుకుతున్న రాష్ట్ర పరిస్థితిపై ఈ భేటీలో చర్చ జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చిన అఖిలపక్ష సమావేశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
కొన్ని రోజుల నుంచి మణిపూర్ హింసాచారం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇంత మంది చనిపోయిన తరువాత మీకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆలోచన వచ్చిందా. ఇంకా ఎంత మంది ప్రాణాలు పోవాలి, హింస ప్రారంభం అయిన మొదట్లోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేదా అని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అఖిలపక్ష సమవేశంలో ప్రధాని నరేంద్ర మోదీ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, యువరాజు రాహుల్ గాంధీ మండిపడ్డారు. సుమారు 50 రోజుల నుంచి మణిపూర్ రగిలిపోతున్నదని, అయితే ప్రధాన నరేంద్ర మోదీ చాలా మౌనంగా విదేశీ పర్యటనకు వెళ్లిపోయారని, అంతకు ముందే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉంటే ఇలా జరిగేదా ? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

మణిపూర్ లో జరిగిన హింసకు ఎవరు కారణం ?, సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందా ? అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మణిపూర్ ప్రజలు శాంతియుతంగా ఉండాలని. అన్ని సమస్యలు చర్చలు ద్వారానే పరిష్కారం అవుతాయని, అంత వరకు ఓపికతో ఉండాలని రాహుల్ గాంధీ మణిపూర్ ప్రజలకు మనవి చేశారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications