బీజేపీ గెలుపు సీక్రెట్ బయటపెట్టిన రాహుల్.. ఆటంబాంబు లాంటి సాక్ష్యం!
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయని ప్రశ్నించిన ఆయన.. నకిలీ ఓట్లు పడుతున్నాయని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని జనాభా కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం, బీజేపీ మధ్య కుమ్మక్కు జరిగిందని ఆయన ఆరోపించారు. బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్ ఆరోపించారు.
రాహుల్ గాంధీ కొన్ని ఓటర్ల పత్రాలను ఉదహరిస్తూ వాటిలో ఉన్న లోపాలను పాయింటర్ల ద్వారా వివరించారు. అనేక ఓటర్ల పత్రాల్లో ఓటరు తండ్రి పేరులో అక్షరాలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయని చూపించారు. చాలా ఓటరు పత్రాల్లో ఇంటి నంబరు సున్నా (0) అని ఉందని ఆయన అన్నారు.చాలా మంది ఓటర్ల పత్రాల్లో వారి ఫోటోలు లేవని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ లోపాలను చూపించి ఇది "ఓట్ల దొంగతనం" అని అభివర్ణించారు. చివరి 5 నెలల్లో ఎక్కువ మంది ఓటర్లను జాబితాలో చేర్చారని, ఎగ్జిట్ పోల్స్ ఒకలా, ఫలితాలు మరొకలా వచ్చాయని ఆయన ఆరోపించారు. దీని ద్వారా ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆయన వాదించారు.

మహారాష్ట్ర ఫలితాలపైనా అనుమానాలు
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని.. ఆ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. పోలింగ్ నాడు మహరాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని.. పోలింగ్‌నాడు సాయంత్రం 5 గంటల తర్వాత మహారాష్ట్రలో భారీగా ఓటింగ్ జరిగిందని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో జనం లేరని.. అయినా ఎలా సాధ్యమైందంటూ ప్రశ్నించారు. మహారాష్ట్ర ఓటరు జాబితాలో ఫేక్ ఓటర్లను చేర్చారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదన్నారు. ఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వద్ద ఆటం బాంబ్ లాంటి ఆధారాలు ఉన్నాయన్నారు. మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో 40 లక్షల మంది అనుమానాస్పద ఓటర్లు ఉన్నారని, దీనిపై ఎన్నికల సంఘం జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం దొంగ ఓట్లేనని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితా సరైనదా లేదా అనే విషయంపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.
బీహార్‌లో లక్షల మంది ఓటర్లను తొలగించారని.. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశామని.. హర్యానా, మధ్యప్రదేశ్‌లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే ఇమ్యూనిటీ వస్తోందని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పుతున్నాయన్నారు.
ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ డేటాను ఎందుకు ఇవ్వడం లేదని రాహుల్ ప్రశ్నించారు. తాము పదే పదే ఈ డేటా కోసం కోరినప్పటికీ, ఈసీ తమకు సమాధానం ఇవ్వడానికి కూడా నిరాకరించిందని ఆయన తెలిపారు. రాజ్యాంగానికి ఓటు హక్కు ప్రాథమికమని పేర్కొన్న రాహుల్ గాంధీ, సరైన వ్యక్తులకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారా లేదా.. ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లను చేర్చారా లేదా అనే ప్రశ్నలు లేవనెత్తారు.












Click it and Unblock the Notifications