57 రోజుల తర్వాత అజ్ఞాతం వీడిన రాహుల్: కాంగ్రెస్‌లో ఆనందం

న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యాక్షులు రాహుల్ గాంధీ అజ్ఞాతం వీడారు. 57 రోజుల తర్వాత రాహుల్ ఇంటికి చేరుకున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత ఎట్టకేలకు రాహుల్ గాంధీ రావడంతో ఆయన పైన ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠకు తెరపడింది. రాహుల్ గాంధీ అజ్ఞాతం, రాక పైన ఎవరు రాద్ధాంతం చేయవద్దని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. రాహుల్ నివాసానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేరుకున్నారు.

కాగా, ఫిబ్రవరి 20 నుంచి రాహుల్‌ గాంధీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ బడ్డెట్‌ సమావేశాలకు ఆయన సెలవు పెట్టారు. పార్టీ భవిష్యత్‌ గురించి, పార్టీలో తన భవిష్యత్‌ గురించి అంతర్మథనం చేసుకోవడానికే రాహుల్‌ సెలవు పెట్టారని ఇన్నాళ్లు పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి.

Rahul Gandhi returned, Congress happy

రాహుల్‌ బుధవారం రాత్రిలోగా ఢిల్లీ చేరుకుంటారని, ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనున్న కిసాన్‌ ర్యాలీలో పాల్గొననున్నారు. ఇప్పుడు రాహుల్ రాక నేపథ్యంలో ఆయన కిసాన్ ర్యాలీలో పాల్గొంటారని చెప్పవచ్చు. మరోవైపు రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ నాయకత్వ బాధ్యతలు స్వీకరించే విషయం ఆసక్తికరంగా మారింది.

రాహుల్ గాంధీ అజ్ఞాతం పైన బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇటీవలి వరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఎందుకు అజ్ఞాతం వీడారోనని, ఆయన వచ్చినప్పుడు చూద్దామని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, షీలా దీక్షిత్‌లు కూడా ఆయన అజ్ఞాతం పైన తమదైన శైలిలో స్పందించారు. ఇప్పుడు రాహుల్ రాకతో పార్టీ వర్గాల్లో ఆనందం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+