40 శాతం కమీషన్ ప్రభుత్వానికి 40 సీట్లలో నామం గ్యారెంటీ, మేము 150 నాటౌట్, రాహుల్ !

బెంగళూరు/విజయపుర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో, కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

కర్ణాటకలోని విజయపురలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన రాహుల్ గాంధీ కర్ణాటకలో ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ తో లూటీలు చేసిందని ఆరోపించారు. 40 శాతం కమీషన్ వసూలు చేసిన బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం వాళ్లకు ఉన్న సీట్లలో 40 శాతం సీట్లు కోల్పోతుందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.

Rahul Gandhi said that 40 percent BJP government will lose 40 seats

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడిగుల ఆశీర్వాదం వలన కాంగ్రెస్ పార్టీ 150 సీట్లలో విజయం సాధించి ఎవ్వరి మద్దతు లేకుండా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని, అందులో ఎలాంటి డౌట్ లేదని యువరాజు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తమకు ఎవరి మద్దతు అవసరం లేదని రాహుల్ గాంధీ పరోక్షంగా జేడీఎస్ కు జర్క్ ఇచ్చారు.

కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవినీతి ఆకాశాన్ని తాకిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వంలో ఏ పని జరగాలన్నా కచ్చితంగా 40 శాతం కమీషన్ ఇవ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారని, చివరికి ఎస్ఐ ఉద్యోగాల నియామకం పరీక్షల్లో కూడా బీజేపీ ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు లూటీ చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఇలా అవినీతితో సంపాధించిన డబ్బుతో బీజేపీ నాయకులు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారని ,ఇంత జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు చోద్యం చూస్తూ కుర్చున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ నాయకుల మీద విరుచుకుపడ్డారు.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల తరువాత బీజేపీ నాయకులు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడం సాధ్యం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని, ఈసారి బీజేపీ నాయకులు ఆపరేషన్ కమల చేపట్టడానికి ఎలాంటి అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+