రాహుల్ ఓ అబద్ధాల యంత్రం!: కాంగ్రెస్ సభల్లో పాక్ నినాదాలా? అంటూ అమిత్ షా ఫైర్
ఛండీగఢ్: కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాహుల్ గాంధీ ఒక అబద్ధాల యంత్రమని దుయ్యబట్టారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాద్షాపూర్ ర్యాలీలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలో మితిమీరాయన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభల్లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు పెరుగుతున్నాయన్నారు.
బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు. హర్యానాలో కొత్త ట్రెండ్ చూస్తున్నాను. హతిన్ నుంచి థానేసర్ వరకు, థానేసర్ నుంచి పల్వల్ వరకు పాకిస్థాన్ అనుకూల నినాదాలు మిన్నంటుతున్నాయి. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి నినాదాలు చేస్తుంటే ఎందుకు మాట్లాడకుండా ఉంటున్నారు? అని రాహుల్ గాంధీని అమిత్ షా ప్రశ్నించారు.

ఆర్టికల్ 370ని తిరిగి తీసుకొస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీపై అమిత్ షా మండిపడ్డారు. కాశ్మీర్ మనదా? కాదా? ఆర్టికల్ 370ని తొలగించడం సరైందా? కాదా? ఈ ఆర్టికల్ ను మళ్లీ తీసుకొస్తామని కాంగ్రెస్, రాహుల్ చెబుతున్నారు. రాహుల్ గాంధీ.. మరో మూడు తరాలు మారినా దీన్ని వెనక్కి తీసుకురాలేవు. కాశ్మీర్ ను రక్షించేందుకు హర్యానా యువత ఎన్నో త్యాగాలు చేశారు. వాటిని వృథా కానివ్వం అని అమిత్ షా స్పష్టం చేశారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. వక్ఫ్‌బోర్డు చట్టం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి కదా.. ఈ శీతాకాల సమావేశాల్లో మెరుగుపరిచి ప్రవేశపెడతామని తెలిపారు. మరోవైపు, అగ్నివీరులకు ఆర్మీలో పదవి కాలం ముగిసిన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పెన్షన్ వచ్చే ఉద్యోగాలు ఇస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
एक तरफ कांग्रेस की सरकारों में हरियाणा घोटालों का अड्डा बना था, तो दूसरी तरफ भाजपा के नेतृत्व में यह उद्योगों का प्रमुख केंद्र बना है। प्रदेश में औद्योगिक शहरों का निर्माण कर भाजपा सरकार हरियाणा के विकास को और गति देने वाली है। बादशाहपुर वासियों का यह उत्साह बता रहा है कि लगातार… pic.twitter.com/vHHz3AKRxI
— Amit Shah (@AmitShah) September 29, 2024
కాగా, హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఫలితాలు 8న విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఈసారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇక, ప్రాంతీయ పార్టీలు కూడా తగ్గేదేలే అంటున్నాయి.












Click it and Unblock the Notifications