ప్రభుత్వ భవనం బేస్‌మెంట్లో రూ. 2 కోట్లకుపైగా నగదు, కిలో బంగారం సీజ్, రూ. 2వేల నోట్లే!
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ కార్యాయలంలో భారీ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడటం సంచలనంగా మారింది. ప్రభుత్వ కార్యాలయంలో క్లెయిమ్ చేయని రూ. 2.31 కోట్ల నగదు, 1 కిలో బంగారు బిస్కెట్లను రాజస్థాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్‌లో జరిగిన ఈ ఘటనలో 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, రికవరీ చేసిన నగదులో కేవలం రూ.2వేలు, రూ.500 నోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని స్వయంగా రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమీషనర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. శుక్రవారం నాడు రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన రిలీజ్ చేయడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యాలయంలో దాడులు జరిపిన పోలీసులకు కళ్లు చెదిరిపోయేలా బంగారం, కోట్లలో నగదు లభ్యం కావడం చర్చనీయాంశంగా మారింది.

శుక్రవారం(మే 19) రాత్రి దాడులు చేసిన పోలీసులు.. ప్రభుత్వ కార్యాలయంలోని ఓ గదిలో ఉన్న కబ్‌బోర్డులో ఓ బ్యాగును గుర్తించారు. ఆ బ్యాగు నిండా నోట్ల కట్టలు ఉండటంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. అంతేగాక, ఈ బ్యాగులో బంగారు బిస్కెట్లు కూడా ఉండటంతో పోలీసులు మరింత షాక్‌కు గురయ్యారు. ఈ సందర్భంగా ఓ బ్యాగ్‌లో రూ.2.31 కోట్ల నగదు ఉన్నట్టు వారు గుర్తించారు. అనంతరం ఆ మొత్తాన్ని సీజ్ చేసి ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అందజేశారు.
ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశామని జైపూర్ పోలీస్
కమిషనర్ ఆనంద్ శ్రీవాత్సవ చెప్పారు. సీసీటీవీ ఫుటేజీని శోధిస్తున్నామన్న ఆయన.. సీఎం అశోక్ గెహ్లాట్‌కు కూడా ఇదే విషయమై సమాచారం అందించామని తెలిపారు. ఏడుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించామని శ్రీవాస్తవ తెలిపారు. త్వరలోనే పూర్తి విషయాన్ని వెల్లడిస్తానని జైపూర్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
నగదు, బంగారం రికవరీ చేసిన అల్మారా కొన్ని నెలలుగా తాళం వేసి ఉంది. నగదు దొరికిన బేస్‌మెంట్‌ను ఆధార్-యూఐడీ లింక్ చేసిన సిబ్బంది యాక్సెస్ చేశారు. బేస్‌మెంట్‌లోని షెల్ఫ్‌లకు యాక్సెస్ ఉన్న వారిని పోలీసులు ప్రశ్నిస్తారు. మరోవైపు, ప్రభుత్వ కార్యాలయంలో భారీగా నగదు, బంగారం పట్టుబడటంపై ప్రతిపక్ష బీజేపీ, ఇతర పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
#WATCH | Jaipur, Rajasthan: Around Rs 2.31 crores of cash and 1 kg of gold biscuits have been found in a bag kept in a cupboard at the basement of the Government Office Yojana Bhawan. Police have seized these notes and further investigation has been started. CCTV footage is being… pic.twitter.com/xanN2NQhi7
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 19, 2023
ప్రతిపక్ష నాయకుడు (LoP) రాజేంద్ర రాథోడ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 'ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూర్చుని ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజస్థాన్ సచివాలయం నుంచి కోట్లాది రూపాయల నగదు, బంగారం రికవరీ చేయడం ప్రభుత్వంలో గెహ్లాట్ అవినీతి రక్షకుని పాత్ర ఉందనడానికి నిదర్శనం' అని అన్నారు.
యోజన భవన్‌కు ఇంత పెద్ద మొత్తంలో నగదు, బంగారం ఎలా వచ్చిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) వంటి శాఖలకు చెందిన అధికారులెవరూ తమ "బ్లాక్ డీడ్‌లను" దాచడానికి తొందరపడి మీడియా సమావేశంలో పాల్గొనలేదని అన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications