కొంచెం ఓపిక పట్టండి.. మారణహోమం ముందుంది.. రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారతావని భావిస్తున్న తరుణంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.' కొంచెం ఓపిక పట్టండి.. భారత్ లోని ప్రజలు కోరుకున్నదే జరుగుతుంది. దేశంపై కన్నెత్తి చూసిన వాళ్లకు గట్టి గుణపాఠం చెబుతాం. అసలైన దాడులు జరిగేందుకు కొంచెం ఓపికతో ప్రజలు ఉండాలి' అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
దిల్లీలో నిర్వహించిన సంస్కృతి జాగరన్ మహోత్సవ్ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంకోసం సైనికులు ప్రాణాలు అర్పించారు. మన దేశాన్ని రక్షించుకుంటూ వచ్చారు. పెద్దలు, మత పెద్దలు, గురువులు మన ఆధ్యాత్మికతను కాపాడారు. సైనికులు రణభూమిపై పోరాడారు. ఆధ్యాత్మిక గురువులు జీవనభూమిపై పోరాడారు. రక్షణమంత్రిగా అటు సైనికులను, ఇటు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. నా దేశంపై దాడికి పాల్పడిన వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా నాదే.
Whatever you want will happen under PM Modi's leadership: Rajanath Singh on Pahalgam terror attack
— ANI Digital (@ani_digital) May 4, 2025
Read @ANI Story | https://t.co/9ryURzm21h#rajnathsingh #PahalgamTerrorAttack #PMModi pic.twitter.com/UgOCDT96U9
ప్రధాని నరేంద్ర మోదీ పనితనం మీకందరికీ తెలిసిందే. ఆయన పట్టుదల, సామర్థ్యం మనకు తెలుసు. ప్రధాని మోదీ తన లైఫ్ లో ఎన్ని రిస్క్ లు చేశారో చూశారు. ప్రధాని మోదీ సారథ్యంలో మీరు ఏం కోరుకుంటున్నారో అది జరగబోతోంది. కొంచెం ఓపిక పట్టండి.. అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.
ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అధికార వర్గాలతో ప్రధాని మోదీ.. భేటీ అవుతుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తాజాగా వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. పాకిస్థాన్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇప్పటికే సింధూ జలాల రద్దుతోపాటు, వీసాల జారీ రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, ఎగుమతులు, దిగుమతులు నిలిపివేత, పాకిస్థాన్ కు నీరు నిలిపివేత కారణంగా పాకిస్థాన్ సంక్షోభాన్ని అనుభవిస్తోంది. అటు ప్రపంచదేశాలు కూడా పాకిస్థాన్ వైఖరిపై తీవ్రంగా స్పందించాయి.












Click it and Unblock the Notifications