రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లంటే?

దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. 10 రాష్ట్రాల పరిధిలోని ఈ 24 స్థానాలకు వచ్చే జూన్ 18వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే నెల జూన్, జులైలో పదవీ కాలం ముగియనున్న సభ్యుల స్థానాలను భర్తీ చేసేందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. వచ్చే నెలతో పదవీ కాలం ముగియనున్న ప్రముఖులలో మాజీ ప్రధానమంత్రి హెచ్.డి. దేవెగౌడతో పాటు కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్‌నీత్ సింగ్ బిట్టు తదితరులు ఉన్నారు.

రాష్ట్రాల వారీగా స్థానాల వివరాలు: ఎన్నికలు జరగనున్న మొత్తం 24 స్థానాలలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుండి చెరో నాలుగు (4) స్థానాలు ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి మూడు (3) చొప్పున స్థానాలు, జార్ఖండ్ నుంచి రెండు (2) స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంల నుండి ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

Rajya Sabha Elections Schedule Announced for 24 Seats in 10 States Polling on June 18 Details

ఎన్నికల పూర్తి షెడ్యూల్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ జూన్ 1న విడుదలవుతుంది. జూన్ 18వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు (జూన్ 18న) ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. వీటితో పాటు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక కూడా నిర్వహించనున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్రా అజిత్ పవార్, ఏఐఏడీఎంకే ఎంపీ సీవీ. షణ్ముగం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.

రాజ్యసభలో ప్రస్తుత బలాబలాలు: మొత్తం 245 మంది సభ్యుల బలం ఉన్న ఎగువ సభలో (రాజ్యసభ), ప్రస్తుతం అధికార భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 144 స్థానాలతో బలమైన స్థితిలో ఉంది. ఇందులో బీజేపీ ఒక్కటే 113 స్థానాలతో రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన 29 మంది సభ్యులతో కలిపి ప్రతిపక్ష కూటమికి మొత్తం 75 స్థానాలు ఉన్నాయి. మిగిలిన ఇతరులు, ప్రాంతీయ పార్టీల ఖాతాలో 23 స్థానాలు ఉన్నాయి. ఈ తాజా ఎన్నికల ఫలితాలు సభలో పార్టీల బలాబలాలను స్వల్పంగా మార్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+