నేను బిజెపి బిడ్డను: మోడీకే ఓటన్న రాఖీ సావంత్
న్యూఢిల్లీ: సినీ, టీవీ నటి రాఖీ సావంత్ శనివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను భారతీయ జనతా పార్టీ పుత్రికనని, బిజెపి కార్యాలయం తన ఇల్లు అని చెప్పారు. ఆమె ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిజెపిపై తన దృక్పథాన్ని మరోసారి వెల్లడించింది. 'బిజెపికి నేను బిడ్డ వంటి దాన్ని. బిజెపి కార్యాలయం నా ఇల్లు వంటిది. ప్రజలు బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతివ్వాలని కోరుతున్నా' అని ఆమె వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ వార్తా కథనం పేర్కొంది.

రాజకీయాల్లో చేరాలనుకుంటున్నట్లు ఇటీవల ఆమె ప్రకటించారు. ఈ క్రమంలో బిజెపి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం, తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆమె బిజెపి చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాబోయే ప్రధాని బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీయేనని రాఖీ సావంత్ గత కొంతకాలంగా డంకా బజాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ చేరికపై ఊహాగానాలు వినిపిస్తుండగా.. రాఖీ మాత్రం దీని గురించి తాను నిర్ణయం తీసుకోలేదని, ఏది మంచిదో సీనియర్ నేతలే చెబుతారన్నారు.












Click it and Unblock the Notifications