ఆసుపత్రిలో చేరిన కేంద్రమంత్రి పాశ్వాన్, ఐసీయులో చికిత్స
కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారు. పాట్నాలోని పరాస్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు అందిస్తున్నారు.
కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారు. పాట్నాలోని పరాస్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు అందిస్తున్నారు.
నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ హుషారుగా కనిపించారు. ఇప్పుడు హఠాత్తుగా ఆసుపత్రిలో చేరారు. అతనికి ఐసీయులో చికిత్స అందిస్తున్నారు.

పాశ్వాన్ కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వ్యవహారాల మంత్రి. అతను లోక్ జనశక్తి పార్టీ అధినేత. గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సోదరుడు పశుపతి కుమార్ చెప్పారు.
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పాట్నా, కగారియా, బెగుసరాయ్, మొకమ ప్రాంతాల్లో మంత్రి పర్యటించవలసి ఉంది. పాశ్వాన్ ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలిసి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

Click it and Unblock the Notifications