మ్యాగీకి దెబ్బ: మార్కెట్‌లోకి రాందేవ్ బాబా నూడుల్స్
న్యూఢిల్లీ: భారత్‌లో మ్యాగీ నూడుల్స్ నిషేధానికి గురయ్యయాని బాధపడుతున్న తల్లులు ఇక చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విదేశీ మ్యాగీ నూడుల్స్‌కు ప్రత్యామ్నాయంగా ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా స్వచ్ఛమైన ఆటా (గోధమ పండి) తో తయారు చేసిన నూడుల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు.
ఈ నూడుల్స్‌ను విడుదల సందర్భంగా రాందేవ్ బాబా మాట్లాడుతూ ఈ నూడుల్స్ గోధమ పిండి నుంచి తయారైన విషయాన్ని మరిచిపోకండన్నారు. ఇప్పటికే ఆయుర్వేద ఔషధాలు, ఆహార ఉత్పత్తులు, ఆరోగ్య రక్షణ ఉత్పత్తులు, పళ్ల రసాలను ఉత్పత్తి చేస్తున్న తమ సంస్ధ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ కొత్తగా ఆటా నూడుల్స్‌ను తయారు చేస్తుందన్నారు.

ఇందులో ఒక్క ఔన్సు కూడా మైదా పిండిని కలపలేదని, మ్యాగీ నూడుల్స్ స్ధానంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఇవి ఉంటాయని తెలిపారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లో గల హరిద్వార్‌లోని తన ఆశ్రమంలో రాందేవ్ బాబా ఆటా నూడుల్స్ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించారు.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ ఆటా నూడుల్స్‌ను తిన్న వారు సోషల్ మీడియాలో 'రామ్ దేవ్ ఆటా నూడుల్స్ ఉండగా విదేశీ మ్యాగీ ఎందుకు దండగ' అంటూ తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఇక మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించిన సీసం, ఇతర రసాయనాలు ఉన్నాయని పరీక్షల్లో తేలడంతో దేశ వ్యాప్తంగా వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications