అడ్డంగా బుక్ అయిన హీరోయిన్- 100 కోట్ల ఫైన్
ప్రముఖ నటి రన్యా రావు అడ్డంగా దొరికిపోయారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కళ్లు తిరిగేంత జరిమానా పడిందామె మీద. ఏకంగా 102 కోట్ల రూపాయల మేర ఫైన్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుబాయ్ నుంచి ఏకంగా 14.8 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ కొద్ది రోజుల కిందట ఆమె బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఈ మేరకు జరిమానా విధించింది.
ఈ ఏడాది మార్చి 3వ తేదీన రన్యా రావు అరెస్ట్ అయ్యారు. బంగారం స్మగ్లింగ్ కేసులో ఆమెను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని బరువు 14.8 కేజీలు. భారత్ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద రన్యా రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నడం, తమిళ సినిమాల్లో నటించారామె. 2014లో కిచ్చ సుదీప్ హీరోగా వచ్చిన మాణిక్య సినిమాతో శాండల్‌వుడ్‌లో అడుగు పెట్టారు. తెలుగు మూవీ మిర్చికి ఇది రీమేక్.

తమిళంలో వాఘా మూవీలో నటించారు. విక్రమ్ ఫ్రభు ఇందులో హీరో. గోల్డెన్ స్టార్ గణేష్ సరసన పటాకిలో మెరిశారు. కల్యాణ్ రామ్ నటించిన పటాస్‌కు రీమేక్ మూవీ ఇది. రన్యా రావు స్వస్థలం.. చిక్‌మగళూరు. అసలు పేరు హర్షవర్ధిని యజ్ఞేష్. తండ్రి కర్ణాటక క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్‌లో కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశారు. తండ్రి ఉద్యోగరీత్యా చిన్నప్పుడే బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. ఆమె విద్యాభ్యాసం మొత్తం ఇక్కడే సాగింది.
కొంతకాలంగా రన్యా రావ్ దుబాయ్‌కు రాకపోకలు సాగిస్తూ వస్తోన్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం ఆమె దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఉత్త చేతులతో కాదు.. 14.8 కేజీల బంగారాన్ని ఆమె తన వెంట తెచ్చుకున్నారు. 14 కేజీలు, 800 గ్రాముల బరువు ఉండే 15 బంగారం బిస్కెట్లను గమ్‌తో తొడలకు అంటించి మరీ బెంగళూరుకు వచ్చారు. బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీల సందర్భంగా ఆమె గుట్టు రట్టయింది. స్కానర్లల్లో పట్టుబడకుండా ఉండటానికి క్రేప్ బ్యాండేజ్ అంటించుకున్నారు.
ఆమె బంగారం స్మగ్లింగ్ చేస్తోన్నట్లు డీఆర్ఐ అధికారులకు ముందుగానే సమాచారం అందడం వల్ల తనిఖీ చేశారు. ఇంత భారీ ఎత్తున బంగారం లభించిన తరువాత డీఆర్ఐ సిబ్బంది, పోలీసులు- బెంగళూరు లావెల్లె రోడ్‌లో గల ఆమె ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ కేసులో వ్యాపారవేత్త తరుణ్ కొండరాజు, జ్యువెలర్లు సాహిల్ సఖారియా జైన్, భరత్ కుమార్ జైన్. అరెస్ట్ అయ్యారు. వీరంతా ప్రస్తుతం పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్నారు.
-
బంగారం ధరలు కుప్పకూలడం ఖాయం- రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ -
Gold: బంగారం ఈ టాప్ ప్లేసెస్ లో కొంటేనే మీకు లాభం! -
Gold News:ఇండియన్స్ వద్దే అత్యధిక పసిడి నిల్వలు - అసోచామ్ షాకింగ్ రిపోర్ట్..!! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..!












Click it and Unblock the Notifications