కూతురుపై రేప్: ఫిర్యాదు చేసిన తల్లిని వివస్త్రను చేశాడు

Rape survivor's mother assaulted for approaching police
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావా సమీపంలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదిహేను రోజుల క్రితం తన కూతురుపై అత్యాచారం చేసిన వ్యక్తిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమెను అత్యంత దారుణంగా దాడికి పాల్పడటమే గాక, బట్టలిప్పేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, బాధిత కుటుంబానికి భద్రత ఏర్పాటు చేశారు. నిందితుడు సన్నిపై కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం నిందితుడు సన్ని బాధితురాలి ఇంటికి వచ్చి ఆమె తల్లిని తనపై పెట్టిన అత్యాచారం కేసును ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు గురి చేశాడు. ఆమె అందుకు నిరాకరించడంతో ఇనుప రాడ్‌తో దాడికి పాల్పడ్డాడు. అంతేగాక తనపై కేసు పెట్టినందుకు శిక్షగా ఆమెను జుట్టు పట్టుకుని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి వివస్త్రను చేశాడు. అతనితోపాటు సుమారు 25 మంది దుండగులు వచ్చినట్లు బాధితురాలు తెలిపింది.

దుండుగులు ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయిన తర్వాత బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తాము ఈ ఘటన జరిగిన నాటి నుంచి ఇంటి నుంచి బయటకు రావడం లేదని బాధితురాలు తెలిపింది. తమకు పోలీసులు సహాయం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పింది. తన కూతురుపై అత్యాచారానికి, తనపై దాడికి పాల్పడిన దుండగులపై పోరాటం ఆపబోమని బాధితురాలు తెలిపింది.

తామందరం న్యాయం కోరుకుంటున్నామని బాధితురాలి భర్త చెప్పాడు. తన కూతురుపై అత్యాచారం చేసి, తన భార్యను గ్రామస్తుల ముందు వివస్త్రను చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి నుంచి ఎస్ఎస్‌పి దినేష్ కుమార్ వాంగ్మూలం తీసుకున్నారు.

బాధిత కుటుంబ సభ్యులకు 24గంటలపాటు ఇద్దరు కానిస్టేబుళ్లతో రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. నిందితుడు సన్నీతోపాటు అతని తండ్రి, కజిన్లపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కాగా, మే 11 తేదీన నిందితుడు సన్నీ బాధితురాలి కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+