అక్కడికొచ్చే వారు రేప్‌లు చేయరు, నిలదీయండి: మురారీ బాపు
పనాజీ: గుజరాత్‌కు చెందిన మోరారీ బాపు అనే మత గురువు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సత్సంగ్‌కు హాజరయ్యే వారు అత్యాచారాలకు పాల్పడరని చెప్పారు. సత్సంగ్‌లో ఆధ్యాత్మిక కార్యకలాపాలు, భజనలు జరుగుతాయి. వీటికి వచ్చేవారు అలాంటి పనికి పాల్పడరని చెప్పారు.
సత్సంగ్‌కు హాజరు కావడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చునని చెప్పారు. అలాగే మహిళల పైన జరిగే ఇతర దారుణాలు కూడా జరగవన్నారు.

ఆయన బుధవారం నాడు రాత్రి గోవాలో విలేకరులతో మాట్లాడారు. ఓటర్లు తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను మహిళా రిజర్వేషన్ బిల్లు పైన నిత్యం నిలదీయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఆగిపోతుందో ప్రశ్నించాలన్నారు. ఆలస్యం చేయకుండా దానిని పాస్ చేయాలని కోరాలన్నారు.
తన అభిప్రాయం వరకు.. సత్సంగ్‌కు హాజరయ్యే వారు అత్యాచారాలకు పాల్పడరని చెప్పారు. అంతేకాదు, సత్సంగ్ అనేది ఓ మతపరమైన కార్యక్రమం కాదని, అది ఆధ్యాత్మిక అనుభవమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను అన్యాయాలకు, వేధింపులకు, లైంగిక దాడులకు ఓ మహిళ శరీరం వస్తువుగా మారవద్దన్నారు. ఆలోచన విధానంలో మార్పులు రావాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications