రష్మిక మందన్న వీడియో కేసులో కొత్త మలుపు
ఢిల్లీ: ప్రముఖ నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియో (Deepfake video) వ్యవహారంలో కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే దీనిపై చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్, టాలీవుడ్ నటులు, దర్శకుడు స్పందించారు.
సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ నుంచీ రష్మిక మందన్నకు మద్దతు లభించింది. అక్కినేని నాగచైతన్య, మృణాల్ ఠాకూర్.. వంటి కొందరు నటులు డీప్ ఫేక్ వీడియో పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తాజాగా ఈ వ్యవహారంలో ఢిల్లీ మహిళా కమిషన్ (Delhi Commission for Women) జోక్యం చేసుకుంది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై సమగ్ర విచారణకు ఆదేశించింది. కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ పోలీసులకూ సూచించింది.
మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఢిల్లీ సైబర్ సెల్ విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌లోని 465 (ఫోర్జరీ), 469 (పరువుకు భంగం వాటిల్లడం) కింద కేసు పెట్టారు. అలాగే- ఐటీ యాక్ట్‌లోని 1860, 66సీ, 66ఈ (ప్రైవసీని దెబ్బతీయడం) కింద ఎఫ్ఐఆర్‌ను ఫైల్ చేశారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొందరు వ్యక్తులు రష్మిక మందన్నకు చెందిన ఓ డీప్ ఫేక్ వీడియోను రూపొందించిన విషయం తెలిసిందే. అశ్లీలమైన వీడియో అది. నిజానికి- అందులో కనిపించింది. జరా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. ఆమె వీడియోను రష్మిక మందన్నగా మార్ఫింగ్ చేశారు.












Click it and Unblock the Notifications