RBI కొత్త రూల్స్, లోన్ రికవరీ ఏజెంట్లు వేధిస్తే జైలుకే!
అప్పు తీసుకున్న వారిని వేధించే రికవరీ ఏజెంట్ల ధోరణికి ముగింపు పలకాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్ణయించింది. రుణ వసూలు ప్రక్రియను మరింత పారదర్శకంగా, మర్యాదపూర్వకమైన పద్ధతిలో నిర్వహించేలా ఫిబ్రవరి 12, 2026న కీలక సవరణ ఆదేశాలను విడుదల చేసింది. ఈ కొత్త నియమాలు జూలై 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. దీనిపై మార్చి 6లోపు ప్రజల నుండి అభిప్రాయాలను కోరింది.
ఇకపై ఎవరిని పడితే వారిని రికవరీ ఏజెంట్లుగా నియమించడానికి బ్యాంకులకు వీలుండదు. కొత్త నిబంధనల ప్రకారం, రికవరీ ఏజెంట్లు ఖచ్చితంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (IIBF) నిర్వహించే డెట్ రికవరీ శిక్షణ పూర్తి చేసి, ధృవీకరణ పత్రం (Certification) పొందాలి. బ్యాంకులు తమ ఏజెంట్ల నియామకానికి ముందు వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, తగిన జాగ్రత్తలు (Due Diligence) తీసుకోవడం తప్పనిసరి.

వేధిస్తే కఠిన చర్యలు: RBI
రుణ గ్రహీతల గోప్యతను గౌరవించడంపై ఆర్‌బీఐ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఏజెంట్లు నిర్ణీత సమయాల్లో మాత్రమే బాకీదారులను సంప్రదించాలి. అకాల సమయాల్లో కాల్స్ చేయడం, అసభ్య పదజాలం వాడటం, బెదిరింపులకు పాల్పడటం వంటివి చేస్తే సదరు బ్యాంకులపై కఠిన చర్యలు ఉంటాయి. వసూలు ప్రక్రియలో కేవలం అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఏజెంట్లకు అందించాలి తప్ప, వ్యక్తిగత గోప్యతను దెబ్బతీయకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ఫిర్యాదు పెండింగ్‌లో ఉంటే రికవరీ ఆపాల్సిందే!
ఒకవేళ రుణ గ్రహీత బ్యాంకుకు లేదా ఏజెంట్ ప్రవర్తనపై ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదు పరిష్కారమయ్యే వరకు సదరు కేసును ఏజెంట్‌కు అప్పగించకూడదు. అంటే, ఫిర్యాదుపై విచారణ జరుగుతున్న సమయంలో రికవరీ చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి ఉంటుంది. అలాగే, బ్యాంకులు తమ ఉద్యోగులు మరియు ఏజెంట్ల కోసం ప్రత్యేక 'ప్రవర్తనా నియమావళి' (Code of Conduct)ని రూపొందించుకోవాలి.
TRAI నిబంధనలు కూడా అమలు
బ్యాంకులు ఆర్‌బీఐ ఆదేశాలతో పాటు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాలను కూడా పాటించాలి. వాణిజ్యపరమైన సమాచారం అందించేటప్పుడు టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ రెగ్యులేషన్స్ (2018) నియమాలను ఉల్లంఘించకూడదు. ఈ సవరణల వల్ల అప్పులు వసూలు చేసే క్రమంలో ఉండే అనవసర ఒత్తిడి, వేధింపులు తగ్గి, రుణ గ్రహీతలకు చట్టపరమైన భరోసా లభించనుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications