MH Elections: డేంజర్ బెల్స్ - రంగంలోకి ట్రబుల్ షూటర్స్..!!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల పర్వం ముగిసింది. ఇదే సమయంలో సీటు దక్కని వారు రెబల్స్ గా బరిలో ఉన్నారు. రెండు కూటముల నుంచి ముఖ్య నేతల నియోజకవర్గాల్లో వీరి పోటీ ఇప్పుడు ప్రధాన పార్టీలకు సమస్యగా మారుతోంది. ప్రచారం ప్రారంభానికి పార్టీలు సిద్దం అవుతున్నాయి. మేనిఫెస్టోల పైన కసరత్తు చేస్తున్నాయి. ఈ సమయంలోనే ట్రబుల్ షూటర్స్ ను పార్టీలు రంగంలోకి దించాయి.
ముగిసిన నామినేషన్లు
మహారాష్ట్ర రెండు ప్రధాన కూటముల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. నామినేషన్ల పర్వం ముగిసినా.. ఇంకా రెండు కూటముల నుంచి దాదాపు 15 సీట్ల పై స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ లీడ్ చేస్తున్న మహాయుతి కూటమిలో నాలుగు సీట్లకు అభ్యర్ధులను అధికారికంగా ఖరారు చేయాల్సినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎంవీఏ నుంచి 11 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎంవీఏ నుంచి కాంగ్రెస్ 103, ఉద్ధవ్ ఠాక్రే శివసేన 87, శరద్ పవార్ ఎన్సీపీ 87 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

బరిలో రెబల్స్
మహాయుతి కూటమి లో బీజేపీ 152, అజిత్ పవార్ ఎన్సీపీ 52, ఏక్ నాథ్ షిండే శివసేన 80 సీట్లలో అభ్యర్థులను పోటీలోకి దించింది. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 7995 మంది అభ్యర్థులు 10905 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో చివరి రోజున 4736 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. షిండే శివసేన సిట్టింగ్ లో ఇద్దరు మినహా మిగిలిన వారికి అందరికీ సీట్లు కేటాయించింది. మహాయుతి నుంచి నవాబ్ మాలిక్ అభ్యర్దిత్వం పైన కూటమి పార్టీల్లో అభ్యంతరం వ్యక్తం అవుతోంది. రెబల్స్ ను పోటీ నుంచి తప్పించటానికి ప్రధాన పార్టీలు తమ ట్రబుల్ షూటర్స్ ను రంగంలోకి దించాయి.
బుజ్జగింపులు
నామినేషన్ల ఉపసంహరణ కు నవంబర్ 4 చివరి రోజు. అప్పటి లోగా పార్టీలు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. రెబల్స్ బరిలో ఉంటే మొత్తంగా కూటమి గెలుపు అవకాశాలపైనే ప్రభావం పడుతుందని రెండు కూటమిలోనూ మఖ్య నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, దీపావళి వేళ రెబల్స్ ను బుజ్జగించే కార్యక్రమాలు మొదలయ్యాయి. వారికి తమ కూటమి అధికారంలోకి వస్తే ఇచ్చే ప్రాధాన్యత.. పదవుల పైన హామీలు ఇస్తున్నారు. దీంతో .. ఇప్పుడు రెబల్స్ ను బుజ్జగించి పోటీ నుంచి తప్పించటం పార్టీ నేతలకు పరీక్షగా మారుతోంది. ఇక..స్వంతంత్ర అభ్యర్ధులుగా బరిలోకి దిగిన వారిలో ఎంద మంది వెనక్కు తగ్గుతారనేది నామినేషన్ల ఉపసంహరణ తరువాత క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications