Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జాతీయ ఐక్యతకు కొత్త ముప్పు..?

ముస్లిం మైనారిటీల ఓటుబ్యాంక్ విషయంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబం నేతృత్వావన్ని వహిస్తోన్న రాష్ట్రీయ జనతాదళ్ అనుసరిస్తోన్న రాజకీయ వ్యూహాలు, బుజ్జగింపు వ్యవహారాలు అటు తిరిగి, ఇటు తిరిగి చివరిక దేశ ఐక్యతకే ముప్పులా పరిణమించాయనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమౌతోన్నాయి.

బీహార్‌ సీమాంచల్ రీజియన్‌లో ఓటుబ్యాంక్‌ను పెంచుకోవడానికి ముస్లింల బుజ్జగింపు రాజకీయాలకు ఆర్జేడీ తెర తీసినట్టే కనిపిస్తోంది. కిషన్‌గంజ్, అరారియా, కతిహార్, పూర్నియా వంటి జిల్లాలు సీమాంచల్ రీజియన్‌ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ముస్లింల జనాభా అధికంగా ఉంటోంది.

Rise in the Muslim population in Seemanchal of Bihar raises concerns about national unity

బంగ్లాదేశ్ నుంచి చోటు చేసుకుంటోన్నఅక్రమ చొరబాట్ల వల్ల సీమాంచల్ రీజియన్‌లో ముస్లిం జనాభా గణనీయంగా పెరగడం, వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆర్జేడీ బుజ్జగింపు రాజకీయాలకు దిగడం వల్ల సామాజిక, రాజకీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తుందని, జాతీయ ఐక్యత గురించి ఆందోళనలు మరింత పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు.

ఒకవంక బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా శాతం భారీగా తగ్గిపోతోంది. విభజన సమయంలో 42 శాతంగా ఉన్న హిందువుల జనాభా 2022 నాటికి కేవలం 7.95 శాతానికి పడిపోయిందని చరిత్రకారుడు జ్ఞానేష్ కుదాసియా స్పష్టం చేశారు. సీమాంచల్‌లో కొనసాగుతున్న బుజ్జగింపు వ్యవహారం కూడా బీహార్‌లో ఇలాగే హిందువుల జనాభా తగ్గడానికి కారణం కావచ్చని, దేశ ఐక్యతకు ప్రమాదకరమని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

సీమాంచల్‌ రీజియన్‌లో పరిధిలోని జిల్లాల్లో ఇప్పుడు ముస్లింలు.. జనాభాలో 40 నుంచి 70 శాతం వరకు ఉంటోన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకుంటే కిషన్‌గంజ్ జిల్లాలో అగ్రస్థానంలో ఉంది. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతం కావడం వల్ల ఆర్జేడీ, కాంగ్రెస్, ఏఐఎంఐఎం ఆధిపత్యం కోసం పోటీ పడుతోన్నాయి.

ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉండే నియోజకవర్గాలపై అధికంగా దృష్టి సారించాయి ఈ మూడు పార్టీలన్నీ కూడా. లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి తన నివాసంలో ఇస్లామిక్ ఆచారాలను పాటిస్తుండటం.. ఆ సామాజిక వర్గంతో ఆ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని మరింత ప్రస్ఫూటింపజేస్తోందనేది విమర్శకుల వాదన.

ఇలాంటి ప్రయత్నాలు విభజనను పెంచుతాయి. దేశ విభజన, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో బీహార్ ముస్లిం జనాభా వివాదాస్పద పాత్రలు పోషించినట్లు చారిత్రక సూచనలు సూచిస్తున్నాయి. సింధ్ అసెంబ్లీ సభ్యుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ వాదనలను బలపరిచాయి. పాకిస్తాన్ ఆవిర్భవించడానికి బీహార్ ముస్లింలు కృషి చేశారంటూ తేల్చి చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆర్జేడీ, దాని మిత్రపక్షాల బుజ్జగింపు విధానాలు పౌరసత్వ సవరణ చట్టం వంటి సంస్కరణల పట్ల వ్యతిరేకతను నింపాయి. ఇది హింసకు గురైన మైనారిటీలను రక్షించే లక్ష్యంతో పని చేస్తోంది. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై ఎడతెగని దాడులు కొనసాగుతున్నప్పటికీ వారి దుస్థితిని విస్మరిస్తూనే, ముస్లిం ఓట్ల కోసం ఆయా పార్టీలు నిరంతర ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.

ఆర్జేడీ అండతో సరస్వతీ పూజ ఊరేగింపులపై దాడుల వంటి ఘటనలు పునరావృతమౌతాయని, హిందూ మతపరమైన కార్యక్రమాలకు మున్ముందు మరిన్ని ఆటంకాలు కలిగిస్తాయనే ఆందోళనలు బీహార్‌లో నెలకొని ఉన్నాయి.

దీనికి కొనసాగింపుగా సీమాంచల్ రీజియన్‌లోని కొన్ని పాఠశాలల్లో శుక్రవారాలను సెలవు దినాలుగా ప్రకటించడం వంటి ముస్లిం బుజ్జగింపు చర్యలు ఈ ప్రాంతంలో పెరుగుతున్న మత అసమతుల్యత అద్దం పడుతోందని, అక్కడ భవిష్యత్‌లో బంగ్లాదేశ్‌ తరహా వాతావరణం ఏర్పడొచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి.

సీమాంచల్‌లో నెలకొంటోన్న ఇలాంటి పరిస్థితుల వల్ల సామాజిక సమతౌల్యాన్ని దెబ్బతీయడంతో పాటు దేశ నిర్మాణం, సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లుతుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. బీహార్‌లో ఏర్పడ్డ ఇలాంటి పరిస్థితులు ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల సంభవించబోయే అనర్థాలు, జాతీయ ఐక్యతను అస్థిరపరుస్తాయని వారు చెబుతున్నారు.

బీహార్ నాయకత్వం జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందా? లేదా అత్యంత ప్రమాదరకంగా మారిన బుజ్జగింపు రాజకీయ నిండిన మార్గంలో కొనసాగుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+