పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న రూ.2.7 కోట్లను పార్టీకి ఖర్చుపెట్టినా టికెట్ దక్కకపాయె..!!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల టికెట్ల పంపకాల్లో ఉత్కంఠత నెలకొంది. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం ముందు హైడ్రామా చోటుచేసుకుంది. ఆర్జేడీ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు కన్నీరుమున్నీరయ్యాడు. అందరి ముందూ చొక్కా చింపుకొన్నాడు. రోడ్డుపై పడి ఏడుస్తూ నిరసన తెలియజేశాడు. టికెట్లను అమ్ముకుంటోన్నారని ఆరోపించాడు.

ఆ ఆశావహుడి పేరు.. మదన్ షా. సుదీర్ఘకాలంగా ఆర్జేడీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నాడు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడనే పేరుంది. ఈ ఎన్నికల్లో మధుబన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. టికెట్ దక్కుతుందనే ఉద్దేశంతో నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు సైతం చేపట్టాడు. బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టించాడు. చివరికి- సీన్ రివర్స్ అయింది. మధుబన్ టికెట్ ఆయనకు దక్కలేదు.

RJD s Madan Shah Sheds Tears Over Denied Poll Ticket at Lalu s Doorstep

ఈ మధ్యాహ్నం పాట్నాలోని లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి వచ్చాడు. అక్కడికి రావడానికి ముందే లాలూ యాదవ్ ప్రయాణిస్తోన్న కారును సైతం వెంబడించాడు. దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరం నుంచి కారును ఛేజ్ చేస్తూ ఇంటి వరకూ వచ్చాడు. అయినప్పటికీ ఆయనను కలవలేకపోయాడు. టికెట్ పై పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఎటువంటి హామీ లభించకపోవడం, మధుబన్ టికెట్ ను మరో నాయకుడికి కేటాయించినట్లు తెలియడంతో కన్నీటిని ఆపుకోలేకపోయాడు.

లాలూ ప్రసాద్ ఇంటి ముందు రోడ్డుపై పడి ఏడుస్తూ చొక్కా చింపుకొన్నాడు. లాలూ ప్రసాద్ బయటికి రావాలంటూ గట్టిగా కేకలు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చివరికి భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆయనను నచ్చజెప్పి అక్కడి నుండి పంపించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ముడుపులు ఇవ్వడానికి నిరాకరించడం వల్లే తనకు టికెట్ దక్కలేదని ఆరోపించారు.

ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్ టికెట్లను అమ్ముకుంటున్నాడని విమర్శించారు మదన్ షా. మధుబన్ టికెట్ తనకే ఇస్తానని లాలూ ప్రసాద్ తనకు మాటిచ్చారని, సంజయ్ యాదవ్ దీన్ని అమ్ముకున్నాడని ధ్వజమెత్తారు. రూ. 2.7 కోట్లు చెల్లిస్తేనే మధుబన్ టికెట్ ఇస్తానని సంజయ్ యాదవ్ డిమాండ్ చేశాడని అన్నారు. ఈ టికెట్ ను బీజేపీ ఏజెంట్ అయిన సంతోష్ కుష్వాహాకు ఇచ్చారని, తనలాంటి నిజాయితీపరులు, కష్టపడే కార్యకర్తలను పరిగణనలోకి తీసుకోవట్లేదని, డబ్బున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని వాపోయాడు.

తేజస్వి యాదవ్‌పైనా మదన్ సాహ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తేజస్వి ఓ అహంకారి అని, ప్రజలతో కలవడని మండిపడ్డారు. తనకు ఉన్న భూమిని అమ్మి పార్టీ కోసం ఖర్చు చేశానని, బస్సుల్లో ప్రజలను ర్యాలీలకు తరలించానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చావే గతి అని కన్నీరు పెట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+