23 వేల కోట్లు, కరోనా నిర్వహణ ప్యాకేజీ, మోడీ కొత్త క్యాబినెట్ ఆమోదం
కరోనా నిర్వహణ ప్యాకేజీ రూ.23,132 కోట్లకు మోడీ కొత్త క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిని ఎదుర్కొవడంతోపాటు, థర్డ్ వేవ్‌కు సన్నద్ధమయ్యేందుకు అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ కింద ఈ ఫండ్‌ను ప్రకటించింది. రూ.15,000 కోట్ల నిధులను కేంద్రం ఖర్చు చేస్తుందని, రూ.8,000 కోట్ల నిధులను రాష్ట్రాలకు కేటాయిస్తారని కొత్త కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
736 జిల్లాల్లో పీడియాట్రిక్స్ విభాగాలు, 20,000 కొత్త ఐసీయూ పడకల ఏర్పాటు చేస్తారు. ఇందులో 20 శాతం పడకలు పిల్లల కోసం, నర్సింగ్ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, జిల్లా స్థాయిలో ఔషధాల బఫర్ స్టాక్ కోసం ఈ ప్యాకేజీ సహాయపడుతుందని చెప్పారు. రానున్న 9 నెలల్లో ఈ ప్యాకేజీని అమలు చేస్తామని, వచ్చే ఏడాది మార్చిలోపు ఇది పూర్తవుతుందని వివరించారు.

ఏపీఎంసీలను మరింత బలోపేతం చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. మండీలకు మరిన్ని వనరులను అందించడానికి తాము సిద్ధమని, అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ కింద మండీలకు లక్ష కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు తోమర్ తెలిపారు. నూతన సాగు చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. సాగు చట్టాల వల్ల మండీలకు వచ్చే నష్టమేమీ లేదని, నూతన సాగు చట్టాల అమలు వల్ల మండీలకు కోట్ల రూపాయల లాభం వస్తుందన్నారు.
Recommended Video
వ్యవసాయ రంగంలో కొబ్బరి సాగు కీలక పాత్ర పోషిస్తోందని, అందుకే తాము కొకొనట్ బోర్డు యాక్ట్‌ను సవర్తిస్తున్నామని ప్రకటించారు. కొబ్బరి బోర్డుకు అధికారులు ఉండరని, వారి స్థానంలో వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చేవారు బోర్డు అధ్యక్షుడిగా ఉంటారని పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా కొబ్బరి క్షేత్రాన్ని మరింత జీర్ణించుకొని, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని తోమర్ అభిప్రాయపడ్డారు. ఈ బోర్డులో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను సభ్యులుగా చేరుస్తున్నామని తోమర్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications