మోహన్ భగవత్‌కు కూడా కరోనా.. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాక..
కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసుల ప్రవాహం కొనసాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వైరస్ వస్తుండటం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల ఓ వైద్యుడు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత కరోనా బారినపడ్డారు. ఇక ఇప్పుడు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కూడా కరోనా వైరస్ వచ్చింది.
మార్చి 7వ తేదీన ఆరెస్సెస్ జనరల్ సెక్రటరీ సురేశ్ భయ్యాజీతో కలిసి మోహన్ భగవత్ టీకా వేయించుకున్నారు. నాగ్ పూర్ నేషనల్ కాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో టీకా తీసుకున్నారు. మరో డోసు తీసుకోవాల్సి ఉండగా.. భగవత్ కరోనా బారినపడ్డారు. ఆయన ప్రస్తుతం నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆరెస్సెస్ శ్రేణులు తెలిపాయి.

నాగ్‌పూర్ కింగ్ వే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని వివరించారు. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు 1.31 లక్షలకు చేరాయి. 780 మంది చనిపోయారు. మొత్తం మరణాలు లక్షా 67 వేల 642 మందికి చేరింది.
కరోనా కేసులు పెరగడంతో రాత్రి కర్ఫ్యూ.. వీకెండ్ లాక్ డౌన్ కూడా విధిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీలో రాత్రి పూట విధించారు. ఢిల్లీలో 83.29 శాతం కొత్త కరోనా కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో కూడా ఎక్కువ కేసులు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications