'పూర్వోంకీ ఘర్ వాపసీ': హిందు మతం స్వీకరించిన 57 ముస్లిం కుటుంబాలు

న్యూఢిల్లీ: కొన్ని ఏళ్ల కిందట ముస్లిం మతాన్ని స్వీకరించిన 57 ముస్లిం కుటుంబాల వారు ఆగ్రాలో సోమవారం తిరిగి హిందూ మతంలోకి మరారు. సుమారు మొత్తం 200 మంది ముస్లింలు హిందూ మతం స్వీకరించారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వెల్లడించింది.

ఆగ్రాలోని మధురా నగర్‌లో నిర్వహించిన మాస్ ఈవెంట్‌లో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ రీజినల్ హెడ్ రాజేశ్వర్ సింగ్ మాట్లాడుతూ మరింత మంది ఇదే దారిలో నడుస్తారని తెలిపారు. భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ అధ్వర్యంలో 'పూర్వోంకీ ఘర్ వాపసీ' (తిరిగి పూర్వీకుల ఇంటికి) పేరిట తిరిగి హిందూ మతంలోకి తెచ్చామని అన్నారు.

RSS holds 'ghar vapsi' event for 200 Muslims

వచ్చే క్రిస్మస్ రోజున 5 వేల మందికి పైగా ముస్లిం, క్రిస్టియన్స్ ను తిరిగి హిందూ మతంలో చేర్చనున్నామని తెలిపారు. అలిఘడ్ లోని మహేశ్వరీ కాలేజిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఎవరికైనా ధైర్యం ఉంటె అడ్డుకోవచ్చని సవాలు విసిరారు.

ఏ మతమైనా ఒకటే అన్న భావనతోనే హిందూ మతంలోకి మారానని సుఫియా బేగం (76) అన్నారు. ఆగ్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో 200 మందికి పైగా ముస్లింలు హిందూ మతాన్ని స్వీకరించగా వారిలో అత్యధిక వయస్కురాలు సుఫియా బేగం.

తనకు మెరుగైన జీవనాన్ని, తన మనవరాళ్ళకు మంచి విద్యనూ అందించేందుకు ఆర్ఎస్ఎస్ హామీ ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. రోజుకు 5 సార్లు నమాజు చేసే తాను ఇకపై వినాయకుడికి హారతి పాటలు పాడుతానని అన్నారు.

'పూర్వోంకీ ఘర్ వాపసీ' (తిరిగి పూర్వీకుల ఇంటికి) పేరిట భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య నుదుటన విభూదితో దేవతా విగ్రహాలకు అభిషేకం చేయడం ద్వారా వీరు తమ మతాన్ని మార్చుకున్నారు. వీరందరికీ పేర్లు మార్చి, కొత్త పేర్లతో ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు ఇప్పించనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+