వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ బీఐ బోర్డులో ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడు గురుమూర్తి నియామకం, కేంద్రం!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడు, పాత్రికేయుడు ఎస్. గురుమూర్తి (తమిళనాడు), సహకార భారతీ చీఫ్ సతీష్ కాశీనాథ్ మరాథెని భారత రిజర్వు బ్యాంక్ బోర్డులో ప్రత్యేక బోర్డు సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. భారత్ రిజర్వు బ్యాంకులో బోర్డులో సభ్యుల సంఖ్య 10కి చేరింది.

భారత రిజర్వు బ్యాంకు బోర్డు సభ్యుల్లో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉంటారు. భారత రిజర్వు బ్యాంకు బోర్డు సభ్యులుగా గురుమూర్తి, సతీష్ కాశీనాథ్ మరాథెల నియమించాలని కేంద్ర మంత్రి వర్గం తీర్మానించి ఆర్థిక శాఖకు పంపించింది.

RSS ideologue S Gurumurthy appointed to the board of Reserve Bank of India

అర్థిక శాఖ అందుకు ఆమోదముద్ర వెయ్యడంతో ఎస్. గురుమూర్తి, సతీష్ కాశీనాథ్ మారాథెని భారత రిజర్వు బ్యాంకు బోర్డు సభ్యులుగా నియమిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు రాజకీయ వార పత్రిక తుగ్లక్ కు ఎస్ గురుమూర్తి ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్ మంచ్ కు ఉప కార్యదర్శిగా ఎస్. గురుమూర్తి పని చేస్తున్నారు. ఎస్. గురుమూర్తి అర్థశాస్త్రవేత్త, సీఏ పూర్తి చేశారు. చాలకాలంగా ఆర్థిక, రాజకీయ విషయాల గురించి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న గురుమూర్తి బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుదారుడు.

RSS ideologue S Gurumurthy appointed to the board of Reserve Bank of India

గత సంవత్సరం ఎస్. గురుమూర్తి భారత రిజర్వు బ్యాంకు తీరుపై సోషల్ మీడియాలో బహిరంగంగా విమర్శలు చేశారు. రిజర్వు బ్యాంకు భారత వ్యవహారాలను నాశనం చేస్తోందని, అనేక బ్యాంకులను ప్రైవేటీకరణ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తోందని, ఇది చాల తప్పు అంటూ ట్వీట్ చేశారు.

సతీష్ కాశీనాథ్ మరాధె కాలేజీ రోజుల్లో ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు. తరువాత ఏబీవీపీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. నాలుగు సంవత్సరాలు ఏబీవీపీ ట్రజరర్ గా పని చేశారు. అనేక జాతీయ బ్యాంకుల్లో 20 ఏళ్లపాటు పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.

English summary
Central government on Tuesday appointed RSS Ideologue, economist, S. Gurumurthy and Sahakara Bharathi's patron Satish Marathe to the board of the Reserve Bank of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X