ఢిల్లీలో ఘోరం: యువతిని 16 సార్లు పొడిచి హత్య చేసిన సాహిల్, అంతా చూశారే తప్ప..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అంతా చూస్తుండగానే ఓ యువతిని ఓ దుర్మార్డుగు అత్యంత దారుణంగా హత్య చేశాడు. బండరాయితో మోదీ, కత్తితో 16సార్లు పొడిచి, కాలితో తన్ని పాశవికంగా చంపేశాడు. అయితే, అక్కడ చాలా మంది అటు ఇటు వెళుతున్నారు కానీ.. ఆ యువతిని కాపాడేందుకు ఒక్కరూ కూడా ముందు రాకపోవడం శోచనీయం. కూతురి మరణంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఆదివారం ఢిల్లీలో రోహిణి ప్రాంతంలోని షాబాద్ డెయిరీ ప్రాంతానికి చెందిన సాక్షి అనే పదహారేళ్ల బాలికను సాహిల్ అనే రాక్షసుడు దారుణంగా హత్య చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అచేతనంగా పడివున్న సాక్షి మృతదేహాన్ని చూసిన ఆమె తండ్రి జనక్ రాజ్ కన్నీరుమున్నీరుగా విలపించారు. లాయర్ కావాలనుకున్న తన కూతుర్ని దారుణంగా హత్య చేసిన నిందితుడు సాహిల్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 Ruptured Skull, Stabbed 16 times: Preliminary Post-Mortem Report Reveals Gruesome Details in Delhi Murder

కాగా, సాక్షికి, నిందితుడు సాహిల్ గత కొంత కాలంగా స్నేహంగా ఉంటున్నాడని.. శనివారం వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఆదివారం పుట్టినరోజు వేడుక కోసం బయటికి వచ్చిన సాక్షిని అనుసరించి ఆమెతో మరోమారు సాహిల్ విగ్వివాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఆమెను సాహిల్ దారుణంగా హత్య చేశాడని చెప్పారు. సాక్షి తల్లిదండ్రులు మాత్రం నిందితుడికి, తమ కుమార్తెకు మధ్య ఉన్న స్నేహం గురించి తమకు తెలియదని అంటున్నారు.

సాక్షి హత్యతో ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత కొంతకాలంగా ఇక్కడ ఆకతాయిల ఆకృత్యాలు పెరిగిపోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, సాక్షి హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీధిలో జరుగుతున్న దారుణాన్ని పలువురు చూసుకుంటూ వెళ్లినప్పటికీ.. ఎవ్వరూ అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. ఓ వ్యక్తి తమ కుమార్తెపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడిపై కూడా దాడి చేసినట్లు సాక్షి తండ్రి చెపపారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.

యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని పట్టుకున్నారు. అతడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మాలీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీలో నేరగాళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తన జీవితంలో ఇలాంటి ఘోరాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు.

జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. యువతి హత్యను అక్కడున్న చాలా మంది అడ్డుకోకపోవడంపై మండిపడ్డారు. ఇంత దారుణమైన హత్యకు పాల్పడిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలన్నారు. ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరగా శిక్షపడేలా చూడాలన్నారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా ఘటనపై స్పందించారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+