మాలేగావ్ పేలుళ్లు: సాద్వి ప్రజ్ఞాకు బెయిల్, పురోహిత్‌కు నో
మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నేడు విచారణ చేపట్టిన కోర్టు రూ. 5లక్షల పూచికత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నేడు విచారణ చేపట్టిన కోర్టు రూ. 5లక్షల పూచికత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చింది.
ఈ నగదుకు ఇద్దరు హామీగా ఉండాలని, ప్రజ్ఞా పాస్‌పోర్టును ఎన్‌ఐఏకు ఇవ్వాలని ఆదేశించింది. అంతేగాక, ట్రయల్ కోర్టులో విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఈ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌కు కోర్టు బెయిల్ నిరాకరించింది.
కాగా, 2008 సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలో పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. మోటార్ సైకిల్‌లో అమర్చిన రెండు బాంబులు పేలి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారు.

అభినవ్ భారత్ సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు నిర్ధారించారు. దీంతో సాధ్వి ప్రజ్ఞా, కల్నల్ పురోహిత్‌ను 2008లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి వారు జైల్లోనే ఉన్నారు.
గతేడాది వీరి బెయిల్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే సాధ్వి బెయిల్‌పై మాలేగావ్ బాధితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications