సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి.. రైలులో అనుమానితుడి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడికి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 30 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన మహారాష్ట్ర పోలీసులు అనుమానితుడిని అరెస్ట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసినట్లు భావిస్తున్న అనుమానితుడిని శనివారం ఛత్తీస్‌గఢ్‌లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దుర్గ్ జిల్లాలో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న 31 ఏళ్ల యువకుడ్ని ఛత్తీస్‌గఢ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) సిబ్బంది అదుపులోకి తీసుకుంది. ఛత్తీస్‌గఢ్ ఆర్పీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి, తాము రైలులో అదుపులోకి తీసుకున్న వ్యక్తి పోలికలు ఒకేలా ఉన్నట్లు చెప్పారు.

శనివారం మధ్యాహ్నం 2 గంటలకు రైలు దుర్గ్ కి చేరుకున్న సమయంలో జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నారు. నిందితుడు ప్రయాణిస్తున్న రైలు, దాని లొకేషన్‌ను ముంబై పోలీసులు ఆర్పీఎఫ్‌కి పంపారు. ప్రస్తుతం నిందితుడు ఆర్పీఎఫ్ కస్టడీలో ఉన్నాడు. నిందితుడిని ముంబై పోలీసులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు.
ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకున్న వ్యక్తి దాడి ఘటనలో పాల్గొన్న వ్యక్తేనా లేక మరెవైనానా? అని నిర్ధారించేందుకు ముంబై నుంచి పోలీసుల బృందం దుర్గ్‌కు బయల్దేరింది. నిందితుడ్ని ముంబైకి తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా, నిందితుడిగా అనుమానిస్తున్నవ్యక్తి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న్లు తేలింది. అతడ్ని ముందుగా ప్రశ్నించగా.. మొదట తాను నాగ్ పూర్‌వెళ్తున్నట్లు చెప్పిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత బీలాస్‌పూర్ వెళ్తున్నట్లు చెప్పినట్లు ఆర్పీఎఫ్ తెలిపింది.
కాగా, గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ నివాసంలో ప్రవేశించిన నిందితుడు అతడిపై కత్తితో దాడి చేసిన విషయం విదితమే. ఈ దాడిలో సైఫ్‌కి ఆరు చోట్ల గాయాలయ్యాయి. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అతడ్ని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications