సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు :హాజరుకానున్న లాలు, డుమ్మా కొట్టనున్న నితీష్
పాట్నా:ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు కావస్తోంది.ఈ వేడుకలను వైభవంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకొంది.ఈ వేడుకలను దేశంలోని తమ మిత్రులైన పార్టీలను ఎస్ పి నాయకత్వం ఆహ్వానిస్తోంది.అయితే ఈ వేడుకలకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం హాజరుకానని ప్రకటించారు.
సమాజ్ వాదీ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు కావస్తోంది. నవంబర్ 5వ, తేది లక్నో లో పెద్ద ఎత్తున సంబరాలను నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.ఈ వేడుకలకు పలువురు ప్రముఖులను తమకు మిత్రులైన రాజకీయపక్షాలను ఆహ్వనం పంపింది సమాజ్ వాదీ పార్టీ.ఈ మేరకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కు ఆహ్వనాలు అందాయి.

సమాజ్ వాదీ పార్టీ ఆహ్వానాన్ని పురస్కరించుకొని బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఈ వేడుకలకు హాజరుకావాలని నిర్ణయించుకొన్నారు. కాని, బీహార్ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు.
బీహార్ ప్రజలు చాత్ పండుగను ఘనంగా నిర్వహించుకొంటారు. చాత్ పండుగ నిర్వహించుకొనే సందర్భంలో జరిగే ఈ వేడుకలకు దూరంగా ఉండాలని నితీష్ భావిస్తున్నారు.అందుకే ఈ వేడుకలకు హాజరుకాబోనని ఆయన ప్రకటించారు. లాలూ మాత్రం ఈ వేడుకలకు హజరుకానున్నారు.












Click it and Unblock the Notifications