ఇదీ విషయం!: ఈసీ నోటీసులకు శశికళ వివరణ, 72 పేజీల లేఖ
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మంగళవారం నాడు తన ఎన్నికకు సంబంధించిన అంశంపై ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. ఆమె తరఫున పార్టీ న్యాయవాదులు ఈీసికి వివరణ ఇచ్చారు.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మంగళవారం నాడు తన ఎన్నికకు సంబంధించిన అంశంపై ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. ఆమె తరఫున పార్టీ న్యాయవాదులు ఈీసికి వివరణ ఇచ్చారు.
అన్నాడీఎంకే న్యాయవాదులు 72 పేజీల వివరణను ఈసీకి సమర్పించారు. పన్నీర్ సెల్వం మద్దతురాలు చేసిన ఆరోపణలను ఈ వివరణలో శశికళ తోసిపుచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శిని కార్యకర్తలు ఎన్నుకుంటారని, తాత్కాలిక ప్రదాన కార్యదర్శిగా తన నియామకం తాత్కాలిక చర్య మాత్రమేనని శశికళ తన సమాధానంలో వివరించారు.

తాత్కాలిక ఏర్పాట్లు చేసే అధికారం అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్‌కు ఉందని ఆ లేఖలో వివరించారు.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకంపై వివరణ కోరుతూ శశికళకు ఈసీ ఇటీవల నోటీసు పంపించిన విషయం తెలిసిందే. శశికళ ఉంటున్న బెంగళూరు జైలుకే ఈ నోటీసులు వెళ్లాయి.
ఈ నెల 28వ తేదీలోగా శశికళ జవాబు ఇవ్వకుంటే, ఆమె వద్ద సమాధానం లేదని భావించి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈసీ పేర్కొంది. జయలలిత మృతిచెందిన మరుసటి రోజే పార్టీ ప్రదాన కార్యదర్శిగా శశికళ నియామకం కావడంపై అన్నాడీఎంకే తిరుగుబాటు ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈసీ ఈ నోటీసులు పంపింది. దీనిపై శశికళ వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications