ఢిల్లీలో కనివినీ ఎరుగని భద్రత..
న్యూఢిల్లీ: యావత్ దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతోంది. నేషన్ ఫస్ట్- ఆల్వేస్ ఫస్ట్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోనున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మిలటరీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అధికారులు.. ఈ కార్యక్రమాలకు హాజరు కానున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మువ్వన్నెల జెండా ఎగురవేస్తారు. చారిత్రాత్మక గోల్కొండ కోటపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మువ్వన్నెల విద్యుద్దీపాలతో అలంకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చారిత్రాత్మక కట్టడాలు.. త్రివర్ణాలతో మెరిసిపోతున్నాయి. తెలంగాణ సచివాలయం, చార్మినార్, వరంగల్‌లోని వేయి కాళ్ల మండపం, ఏపీలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, కర్నూలు కొండారెడ్డి బురుజు.. ఇలా అనేక కట్టడాలు కొత్త కళను సంతరించుకున్నాయి.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రాష్ట్రాల్లో భద్రత పెంచారు. ఢిల్లీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు డ్రోన్లతో నిఘా ఉంచారు. వాహనాలను తనఖీ చేశారు. ఎర్రకోట సమీపంలో వాహనాలను దారి మళ్లించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నొయిడా, ఘజియాబాద్, గుర్‌గావ్ మీదుగా ఢిల్లీలోకి ప్రవేశించే ప్రాంతాల్లో చెక్ పాయింట్లను నెలకొల్పారు. జవహర్ లాల్ నెహ్రూ మార్గ్, బహదూర్ షా జఫర్ మార్గ్, రింగ్ రోడ్‌లో వాహనాల రాకపోకలను నియంత్రించారు. వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించడానికి ఢిల్లీ వ్యాప్తంగా 3,000 మంది ట్రాఫిక్ పోలీసులను మోహరింపజేశారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications