భార్యతో భర్త బలవంతపు శృంగారం వైవాహిక అత్యాచారం కాదు : ఛత్తీస్‌గఢ్ హైకోర్టు

చట్టబద్ద వివాహంలో భార్యతో భర్త బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించలేమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పేర్కొంది. వైవాహిక అత్యాచార అభియోగం ఎదుర్కొంటున్న ఓ భర్తను నిర్దోషిగా ప్రకటించింది. అదే సమయంలో భార్యతో అతను జరిపిన అసహజ శృంగార చర్యలను నేరంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది.

'18 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న భార్యతో ఆమె భర్త శృంగారం లేదా శృంగారపరమైన చర్యను రేప్‌గా పరిగణించలేం. ఈ కేసులో ఫిర్యాదుదారు.. అభియోగాలు మోపబడిన వ్యక్తికి చట్టబద్దంగా భార్య. కాబట్టి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అతను ఆమెతో బలవంతపు శృంగారం చేసినా... దాన్ని అత్యాచారంగా పరిగణించలేం.' హైకోర్టు వ్యాఖ్యానించింది.

sexual intercourse or sexual act of husband against wife wish not a marital rape says chchattisgarh hc

'భార్య మర్మాంగాల్లో అతను పలుమార్లు ఫింగర్స్,ముల్లంగి,ఇతరత్రా వస్తువులను జొప్పించి అసహజ రీతిలో శృంగార చర్యలకు పాల్పడటాన్ని ఐపీసీ సెక్షన్ 377 కింద నేరంగా పరిగణిస్తున్నాం.' అని కోర్టు వెల్లడించింది.

వివాహమైన కొన్నాళ్లకే తన భర్త తనను కట్నం కోసం శారీరకంగా హింసిస్తున్నాడని ఆరోపిస్తూ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వివాహిత హైకోర్టును ఆశ్రయించింది. అసహజ రీతిలో అతను తనతో శృంగార చర్యలకు పాల్పడ్డాడని ఆరోపించింది. తన ఇష్టం లేకపోయిన బలవంతంగా శృంగారం చేశాడని ఆరోపించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూనే... అసహజ శృంగార చర్యలకు అతనిపై మోపిన నేర అభియోగాలను సమర్థించింది.

ఇటీవల ముంబై కోర్టు కూడా ఇలాంటి తీర్పే ఇచ్చింది. భార్య ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఆమెతో శృంగారం చేయడం చట్టవిరుద్దంగా పరిగణించలేమని పేర్కొంది. ఒక భర్తగా అతను ఆ చర్యకు పాల్పడటాన్ని చట్టవిరుద్దమనలేమని స్పష్టం చేసింది. తన ఇష్టంతో సంబంధం లేకుండా భర్త జరిపిన బలవంతపు శృంగారం తనను పక్షవాతం బారినపడేలా చేసిందని ఆరోపిస్తూ ఓ వివాహిత దాఖలు చేసిన పిటిషన్‌పై ముంబై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆమె పక్షవాతం బారినపడటం దురదృష్టకరమని.. అయితే అందుకు ఆమె భర్తను బాధ్యుడిని చేయలేమని కోర్టు వ్యాఖ్యానించింది.

ఇటీవలే కేరళ హైకోర్టులోని డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు మాత్రం పై తీర్పులకు భిన్నంగా ఉంది. వైవాహిక అత్యాచార అభియోగంపై విడాకులు కోరవచ్చునని కోర్టు పేర్కొంది.వైవాహిక అత్యాచారానికి సంబంధించి ఎటువంటి చట్టం లేనప్పటికీ... ఆ కారణంగా విడాకులు కోరవచ్చునని తెలిపింది. 'వైవాహిక జీవితంలో సెక్స్ అనేది జీవిత భాగస్వామితో సాన్నిహిత్యాన్ని ప్రతిబింబించేదిగా ఉంటుంది.ఈ కేసులో మహిళ సమర్పించిన ఆధారాలు.. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అన్ని రకాల దుశ్చర్యలకు ఆమె భర్త పాల్పడ్డాడని చెబుతున్నాయి.భర్త ఎప్పుడైతే భార్య శరీరంపై అజమాయిషీ చలాయిస్తాడో అది వైవాహిక అత్యాచారం కిందకు వస్తుంది.' అని కేరళ కోర్టు స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+