రాజ్యసభ డిప్యూటీ చైర్మన్: ఎన్డీయే అభ్యర్థికే శివసేన మద్దతు, బీజేపీకి ఊరట
ముంబై: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో శివసేన ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించింది. ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ బరిలో నిలిచారు. ఆగస్ట్ 9వ తేదీన ఎన్నికలు ఉన్నాయి. దీనిపై శివసేన ఎంపీ అనిల్ దేశాయి మాట్లాడుతూ.. ఎన్డీయే అభ్యర్థికి తాము మద్దతిస్తున్నామని చెప్పారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో విపక్షం లోకసభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు శివసేన దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా బీజేపీపై సందర్భం వచ్చినప్పుడల్లా శివసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతిస్తామని ప్రకటించడం గమనార్హం.

మరోవైపు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విపక్ష అభ్యర్ధిగా కాంగ్రెస్‌కు చెందిన బీకే హరిప్రసాద్ రంగంలో నిలిచారు. వీరిరువురూ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో ఎన్డీఏ సంప్రదింపులు చేస్తోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications