వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక అడుగుజాడల్లో భారత్ లో బుర్ఖాలను పూర్తిగా నిషేధించాలి .. మోడీకి శివసేన డిమాండ్

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీని దేశవ్యాప్తంగా బుర్ఖాను నిషేధించాలని శివసేన డిమాండ్ చేసింది. తమ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ శ్రీలంక అడుగుజాడలను అనుసరించాలని సూచించింది.

 చంద్రబాబుకు, టీ కాంగ్రెస్ కు షాక్..కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కేసీఆర్ కు లేఖ రాసిన రఘువీరా చంద్రబాబుకు, టీ కాంగ్రెస్ కు షాక్..కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కేసీఆర్ కు లేఖ రాసిన రఘువీరా

ఉగ్ర దాడుల నేపధ్యంలో బుర్ఖాలు, ముసుగులపై నిషేధం విధించిన శ్రీలంక

ఉగ్ర దాడుల నేపధ్యంలో బుర్ఖాలు, ముసుగులపై నిషేధం విధించిన శ్రీలంక

శ్రీలంక ప్రభుత్వం శ్రీలంక లో వరుస బాంబు దాడుల నేపథ్యంలో శ్రీలంక దేశంలో ఎవరు ఎలాంటి ముసుగులు ధరించడానికి వీల్లేదని నిషేధాన్ని విధించింది. శ్రీలంకలో ఈస్టర్ నుండి జరుగుతున్న వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో 250 మందికి పైగా మృతి చెందారు. ఇంకా శ్రీలంక వాసులు బాంబు దాడులు సృష్టించిన భయోత్పాతం నుండి బయటపడలేదు. అయితే ముసుగు ధరించడంవల్ల బాంబు దాడులకు పాల్పడిన వారిని గుర్తించలేకపోవడంతో శ్రీలంక ప్రభుత్వం ఎవరు ఎలాంటి ముసుగులు ధరించ వద్దంటూ శ్రీలంక దేశవ్యాప్తంగా బుర్ఖా లపై, ముసుగులపై నిషేధం విధించింది.

భారత్ లో కూడా బుర్ఖాలపై నిషేధం విధించాలని శివసేన డిమాండ్

భారత్ లో కూడా బుర్ఖాలపై నిషేధం విధించాలని శివసేన డిమాండ్

ఇక భారతదేశంలో కూడా ముసుగులపై నిషేధం విధించాలని భారత్లో నిషేధించాల్సినది ట్రిపుల్ తలాక్ మాత్రమే కాదని శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ర్యాలీలో భాగంగా అయోధ్యలో ఉన్న మోడీకి మిత్రపక్షంగా ఉన్న శివసేన రావణుడు పాలించిన దేశమైన శ్రీలంకలోనే ముసుగులపై నిషేధం విధిస్తే రాముడు పాలించిన భారతదేశంలో ముసుగులపై నిషేధం ఎందుకు విధించకూడదు అంటూ ప్రశ్నించింది.

ఉగ్రవాద దాడులను నివారించడానికి శ్రీలంక తరహాలో ప్రభుత్వ ప్రదేశాల్లో, ప్రైవేటు సంస్థల్లో ముఖాలపై ముసుగులు, బుర్ఖాలపై పూర్తిగా నిషేధం విధించాలని హిందూసేనకు లేఖ రాసింది.

భారత్ లో ఉగ్ర దాడులు జరగకుండా నివారణా చర్యల్లో భాగంగా ముసుగులు నిషేధించాలని లేఖ

భారత్ లో ఉగ్ర దాడులు జరగకుండా నివారణా చర్యల్లో భాగంగా ముసుగులు నిషేధించాలని లేఖ

"ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబార కార్యాలయాలు మరియు ఉన్నత కమీషన్లతో సహా భారతదేశంలో ఎటువంటి ఉగ్రదాడులనైనా నివారించడానికి వ్యూహాత్మక స్థాయిల్లో వెంటనే విధానాలను రూపొందించాలని మేము కోరుతున్నాం" అని లేఖలో పేర్కొంది."దయచేసి ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లో పూర్తిగా ముఖాలను కవర్ చేస్తూ ధరించే బుర్ఖాలు కానీ, ముసుగు వంటి దుస్తులను కానీ నిషేధించండి, ఈ రకమైన ముసుగుల వల్ల సీసీటీవీ కెమెరాలు మరియు ఇతర నిఘా చర్యల నుండి ఉగ్రవాదులు తప్పించుకునే ఆస్కారం వుంటుంది" అని పేర్కొంది.

శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు .. బీజేపీకి తలనొప్పులు

శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు .. బీజేపీకి తలనొప్పులు

భారత్ కూడా శ్రీలంక అడుగుజాడల్లో నడవాలని , బుర్ఖాలపై పూర్తిగా నిషేధం విధించాలని ప్రస్తుతం శివసేన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో మిత్రపక్షమైన బీజేపీకి ఎలాంటి తలనొప్పులు తెచ్చిపెడతాయో మరి వేచి చూడాల్సిందే.

English summary
The Shiv Sena made a controversial demand that Prime Minister Narendra Modi must ban burqa across the country.The Sena has contended that its ally, BJP must follow Sri Lanka's footsteps and ban burqas across India. "We request you to immediately formulate policies at both tactical and strategic levels to prevent occurrence of such attacks in India and Indian territories, including embassies and high commissions, all across the world," the letter read.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X