శివసేన నాయకుడిపై హత్యాయత్నం
థానే: పాతకక్షల కారణంగా శివసేన నాయకుడిపై హత్యాయత్నం జరిగిన సంఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. తీవ్రగాయాలైన స్థానిక శివసేన నాయకుడు ధర్మేంద్ర చౌబే ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడని పోలీసులు చెప్పారు.
థానేలో ధర్మంద్ర చౌబే పలుకుబడి ఉన్న నాయకుడు. శివసేన కార్యక్రమాలలో చురుకుగా పాల్గోనే వాడు. శుక్రవారం రాత్రి హజౌరి ప్రాంతంలో ధర్మేంద్ర ఉన్నారు. ఆ సందర్బంలో ఐదుగురు మారణాయుధాలతో ధర్మేంద్ర చౌబే పై దాడి చేశారు.

కత్తులతో ఇష్టం వచ్చినట్లు పోడిచారు. విషయం గుర్తించిన స్థానికులు వాగ్లే ఎస్టేట్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాగ్లే ఎస్టేట్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దిలీప్ సోలంకే తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
విషయం గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారైనారు. పోలీసులు ధర్మంద్ర చౌబేని ఆసుపత్రికి తరలించారు. స్థానిక సమస్యలు, పాతకక్షల కారణంగా హత్యాయత్నం జరిగిందని ఎస్ఐ దిలీప్ సోలంకే అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications