అవాక్కయ్యే వార్త : వరుణదేవుడి ప్రసన్నం కోసం ఇద్దరు అబ్బాయిల పెళ్లి!!
కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఊహించని షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే వర్షాకాలం కావడంతో వర్షాలు కురవాల్సి ఉన్నా, రుతుపవనాలు ఈసారి ఆలస్యంగా రావడంతో కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురవడం లేదు. ఈ క్రమంలో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక చోట్ల రకరకాల ఆచారాలను పాటిస్తున్నారు. కప్పతల్లి పూజలు చేస్తున్న వారు కొందరైతే వర్షాలు బాగా కురవాలని ఏకంగా పెళ్ళిళ్ళు చేస్తున్నవారు మరికొందరు.
కర్ణాటక రాష్ట్రంలోనో మాండ్యా జిల్లాలో వర్షాల కోసం పడిగాపులు కాస్తున్న ఓ గ్రామంలోని ప్రజలంతా కలిసి ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశారు. ఇద్దరు అబ్బాయిలు ఒకరినొకరు వివాహం చేసుకుంటే వర్షాలు కురుస్తాయని నమ్మిన మాండ్య జిల్లా కృష్ణ రాజ్ పేట గంగేన హళ్లి గ్రామస్తులు ఇద్దరు అబ్బాయిలకు ఒకరినొకరు ఇచ్చి పెళ్లి చేసిన సంఘటన చోటు చేసుకుంది.

గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఇప్పటి వరకు వర్షాలు కురవక పోవడంతో వరుణదేవుడిని శాంతింపజేయడానికి, ఆ ప్రాంతంలో వర్షాలు కురవడం కోసం ఇలా ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేసినట్టు చెబుతున్నారు. గతంలో కూడా వర్షాలు కురవని పక్షంలో పూర్వీకులు ఇదేవిధంగా ఇద్దరు అబ్బాయిలకు వివాహం చేసే వారని ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం ప్రకారం ఇద్దరు అబ్బాయిలకు వివాహం జరిపించామని చెబుతున్నారు.
సాంప్రదాయ దుస్తులు ధరించి వధూవరులుగా రెడీ అయిన అబ్బాయిలు ఇద్దరూ వివాహం చేసుకున్నారు . గ్రామస్తులు అందరి సమక్షంలో ఈ పెళ్లి శుక్రవారం రాత్రి చాలా ఘనంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో భాగంగా గ్రామస్తులకు ప్రత్యేకమైన విందు ఏర్పాట్లు కూడా చేశారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వర్షాల జాడ లేకుండా పోయింది. దీంతో వర్షం కోసం, వాన దేవుడి చల్లని చూపు కోసం, ఆయన కురిపించే వానల కోసం ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications