రైలు ప్రమాదం: షార్ట్ సర్క్యూటే కారణమా? (పిక్చర్స్)
థానే/ఢిల్లీ: మహారాష్ట్ర థానే జిల్లాలోని దహను పట్టణ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ముంబై-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాదానానికి గురై మూడు బోగీల్లోని 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. కాగా రైలు ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
మృతి చెందిన 9 మందిలో ఓ మహిళ, నలుగురు పురుషులు ఉన్నట్లు గుర్తించామని, మిగితా వారిని ఇంకా గుర్తించలేదని పశ్చిమ రైల్వే పిఆర్ఓ శరత్ చంద్ర తెలిపారు. మరో నలుగురు ప్రయాణికులకు సల్ప గాయాలయ్యాయని ఆయన చెప్పారు. ప్రమాదంలో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు. హుటాహుటిన అక్కడి చేరుకున్న అగ్నిమాపక దళాలు ఇతర బోగీలకు మంటలు అంటుకోకుండా చర్యలు చేపట్టాయని తెలిపారు. ప్రమాదం జరగడంతో రైలును అక్కడే నిలిపివేశారు.
ప్రయాణికులకు ఆహార పదార్థాలను, మంచినీటిని అందించినట్లు శరత్ చంద్ర తెలిపారు. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో బుధవారం ఉదయం 2.50 గంటలకు ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు. షాట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందన్న అభిప్రాయాన్ని తోసిపుచ్చలేమని ఆయన తెలిపారు.
కాగా రైల్లోని ఎక్కువ మంది ప్రయాణికులు మెళకువగా ఉండటంతో ప్రాణనష్టం తగ్గిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో దీపికా షా (65), దేవ్ శంకర్ ఉపాధ్యాయ్ (48), సురేంద్ర షా (68), నాసిర్ ఖాన్ అహ్మద్ ఖాన్ పఠాన్ (50), ఫిరోజ్ ఖాన్ (38) ఉన్నారు.
రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
ఢిల్లీ: డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాద ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున, అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున పరిహారం అందివ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలపై నివేదిక కోరినట్లు ఆయన తెలిపారు.

మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
మహారాష్ట్ర థానే జిల్లాలోని దహను పట్టణ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ముంబై-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాదానానికి గురై మూడు బోగీల్లోని 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. మంటలు ఇతర బోగీలకు అంటుకోకుండా చర్యలు చేపడుతున్న ఫైర్ సిబ్బంది.

బోగీల్లో మంటలు
మహారాష్ట్ర థానే జిల్లాలోని దహను పట్టణ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ముంబై-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాదానానికి గురై మూడు బోగీల్లోని 9 మంది ప్రయాణికులు మృతి చెందారు.

భారీగా ఎగిసి పడుతున్న మంటలు
మహారాష్ట్ర థానే జిల్లాలోని దహను పట్టణ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ముంబై-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాదానానికి గురై మూడు బోగీల్లోని 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో భారీగా ఎగిసి పడిన మంటలు.

ప్రమాదంలో మృతులు
మహారాష్ట్ర థానే జిల్లాలోని దహను పట్టణ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ముంబై-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాదానానికి గురై మూడు బోగీల్లోని 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. వారి మృతదేహాలను భద్రతా దళాలు బోగీ నుంచి బయటికి తీశాయి.

ప్రమాదంతో నిలిపేసిన రైలు
మహారాష్ట్ర థానే జిల్లాలోని దహను పట్టణ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ముంబై-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాదానానికి గురై మూడు బోగీల్లోని 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదానికి గురైన వెంటనే గుర్తించిన రైలు సిబ్బంది రైలును అక్కడే ఆపేశారు.












Click it and Unblock the Notifications