వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ హత్యకు సిమి ఉగ్రవాదుల కుట్ర

|
Google Oneindia TeluguNews

రాయ్ పూర్: భారత ప్రధాని నరేంద్ర మోడీని గతంలో తాము హత్య చెయ్యాలని విఫలయత్నం చేశామని నిషేదిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా ( సిమి) ఉగ్రవాది పోలీసుల విచారణలో అంగీకరించాడు. విషయం తెలుసుకున్న చత్తిస్ ఘడ్ పోలీసులు హడలిపోయారు.

మోడీని హత్య చెయ్యాలని ప్రయత్నించారనే విషయం వెలుగు చూడడంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆ రాష్ట్ర డీజీపీ జే.పీ. సింగ్ తెలిపారు. సిమి ఉగ్రవాది గుర్ఫాన్ ను పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు.

గత లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సందర్బంగా దేశంలోని అనేక రాష్ట్రాలలో జరిగిన బహిరంగ సభలు, ర్యాలీల లో మోడి పాల్గొన్నారు. ఆ సమయంలో అంబికాపుర లోక్ సభ లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలిలో మోడిని అంతం చెయ్యాలని సిమి ఉగ్రవాదులు ప్లాన్ వేశారు.

మోడిని అంతం చెయ్యడానికి విఫలయత్నం చేశారు. అయితే ఆనివార్య కారణాల వలన ఆ ప్లాన్ అమలు చెయ్యలేదని గుర్ఫాన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. జర్ఖండ్ బాంబు పేలుళ్ల తరువాత గుర్ఫాన్ రాయ్ పూర్ నుండి పరారైనాడు.

 Simi had hatched a plot to target Prime Minister Narendra Modi

తరువాత అతను అరేబియా మహాసముద్రం తీరంలో తలదాచుకున్నాడు. అంతకు ముందు గుర్ఫాన్ దుబాయ్ లో ఉండేవాడు. ఆ సమయంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ అబుసలేం, సిమి చీఫ్ ఊమర్ సిధ్దిఖి తో పాటు అనేక మంది నేరస్తులతో గుర్ఫాన్ కలిశాడని పోలీసులు అంటున్నారు.

ప్రపంచంలోని సిమి అగ్రనేతలు అందరూ ఒక సారి నేపాల్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఆ సందర్బంలో గుర్ఫాన్ నేపాల్ వెళ్లాడు. నేపాల్ లో సిమి నాయకులు కలుస్తున్నారని భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు కనిపెట్టలేకపోయాయని గుర్ఫాన్ పోలీసుల విచారణలో చెప్పాడు.

గుర్ఫాన్ సహచరులు ఇజాయిద్దీన్, అస్లాంలు ఇండోర్ పోలీసుల ఎన్ కౌంటర్ లో అంతం అయ్యారు. తరువాత గుర్ఫాన్ కు ప్రాణభయం పట్టుకునింది. తరువాత గుర్ఫాన్ స్వయంగా రాయ్ పూర్ కోర్టు లో లోంగిపోయాడు. అప్పటి నుండి ఇతను పోలీసుల విచారణకు సహకరిస్తున్నాడు.

గుర్ఫాన్ విచారణకు సహకరిస్తున్నా కీలకమైన సమాచారం మాత్రం ఇవ్వడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. ఎలాగైనా జార్ఖండ్ బాంబు పేలుళ్ల నిందితులను గుర్తించడానికి గుర్ఫాన్ నువిచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
In one of the most shocking confessions, Gurfan, a SIMI operative has admitted that his organization had plans to kill Narendra Modi in Ambikapur before he was chosen as the Prime Minister of India, sources inform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X