మోదీకి తలనొప్పిగా తయారైన సుమలత, మాజీ సీఎం, పాము ముంగీసా ఆట !
2019 లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కటి అయిన కర్ణాటకలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గం 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్నడూలేని ఉత్కంఠకు తెరలేపింది. ఇంత వరకు బీజేపీ, జేడీఎస్ పార్టీల్లో ఎవ్వరికి టిక్కెట్ దక్కకపోయినా ఎన్నికల ప్రచారాన్ని తలతన్నేలా అక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి. మండ్య రాజకీయాలు అంటే భారతదేశం వెనక్కి తిరిగి చూసుకునేలాగా ఇప్పుడు సుమలత అంబరీష్ తెరలేపారు.
మండ్య లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఆ నియోజక వర్గం సిట్టింగ్ ఎంపీ సుమలత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామిల మొండిగా పట్టుపడుతున్నారని తెలిసింది. లోక్‌సభ ఎన్నికలకు పొత్తు పెట్టుకున్న బీజేపీ, జేడీఎస్‌లు ఇప్పటికే సీట్ల కేటాయింపును బీజేపీ హైకమాండ్ కు అప్పగించింది. బీజేపీ హైకమాండ్ సీట్లు ఖరారు చెయ్యడానికి కసరత్తులు చేస్తోంది. మండ్య లోక్ సభ సీటు జేడీఎస్ నేతల చేతికి వెలుతుందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న సుమలత అంబరీష్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయమై సుమలత అంబరీష్ సోమవారం మండ్యలో మీడియాతో మాట్లాడుతూ తనకు టికెట్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని, బీజేపీ-జేడీఎస్ కూటమికే టికెట్ తనకే వస్తుందన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. తాను మండ్య నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని సుమలత అంబరీష్ ధీమాగా చెబుతున్నారు.
ఎన్డీయేలో జేడీఎస్ ప్రస్తుతం భాగం అయ్యిందని, అలాగే నేను కూడా ఎన్డీయేలో భాగమే అని సుమలత అంటున్నారు. మరి మండ్య లోక్ సభ సీటు విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం అని సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమలత వ్యాఖ్యలతో మండ్య లోక్ సభ టికెట్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు రైలు మార్గంలో ప్రయాణించడం కష్టంగా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, అన్ని వసతులతో కూడిన రైల్వే వ్యవస్థ కూడా మండ్యకు ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో మండ్యలో చాలా అభివృద్ధి జరిగిందని సుమలత అంబరీష్ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications