టిలో పట్టొద్దా: పార్లమెంట్ వద్ద పాములు పట్టేవాడిగా శివ

అలా అయితే తాము ఎలా బతకాలో చెప్పాలన్నారు. పాములు పట్టేవాడిలా మాట్లాడుతూ.. బిల్లెట్టమనండీ నానేం సేత్తానో మీరు సూత్తరు. ఆ బిల్లుపై నాగ దేవత దయ అన్నారు. అంతా నాగదేవత అమ్మనే చూసుకుంటుందన్నారు. సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, జైరామ్ రమేష్, గులాం నబీ ఆజాద్‌లను ఆ నాగదేవతే చూసుకుంటుందన్నారు. బిల్లు పెడితే తాము తప్పకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా శివ ప్రసాద్ హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రశ్నిస్తే.. తమకు ఆయనే కావాలని, ఆయన లేకుంటే రాష్ట్రం నాశనమవుతుందన్నారు. చంద్రబాబును ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ఆయన తప్ప ఎవరు రాష్ట్రాన్ని బాగు చేయలేరని అన్నారు.
మరో ఎంపి సుజనా చౌదరి మాట్లాడుతూ.. తాము పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకొని తీరుతామని చెప్పారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications