నారదుడి వేషంలో శివప్రసాద్, లోకసభలో విభజన రగడ

ఈ సందర్భంగా ఆయన పాట పాడి నిరసన తెలిపారు. తెలుగువారి మధ్య భలే గొప్ప చిచ్చు పెడితివి సోనియమ్మ.. విద్య, వైద్య, ఉద్యోగంల మాటేమిటి సోనియమ్మ, మరో రాజధాని అభివృద్ధి కావాలంటే మాటలా, మా రైతుల గోడేమిటి అందుకే సోనియమ్మ విను విను.. కళ్లు తెరిచి కను కను, విభజన ప్రక్రియ ఆఫకపోతే ఇటలీదాకా తరిమేరు నిన్ను సోనియమ్మ, ఉన్న రాష్ట్రాలు ఏలుకోక ఊరుకే కూర్చోక, సీమాంధర్ జనం మీద శఠగోపం పెట్టినావు, రెండుసార్లు గెలిపిస్తే రాష్ట్రాన్ని రెండుగా చేస్తావా, రాహుల్ పదవి కోసం రాద్దాంతం చేస్తావా, జలం, విద్యుత్ మాటేమిటి అంటూ నిరసన పాట పాడారు.
ఈ సందర్భంగా శివ ప్రసాద్ మాట్లాడుతూ... నారదుడు కలహభోజనుడే కానీ లోక కల్యాణం కోసం ఆ పనులు చేశారని, ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెసు పార్టీ కలిసి ఉన్న తెలుగు ప్రజలను విడగొడుతోందని ఆరోపించారు. విభజన ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరారు. అంతకుముందు టిడిపి సీమాంధ్ర ఎంపీలు సుజనా చౌదరి నివాసంలో భేటీ అయ్యారు.
కాగా, లోకసభలో రాష్ట్ర విభజన అంశం మంగళవారం కూడా వేడిని రాజేసింది. సభ ప్రారంభం కాగానే సభ్యులు జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలు చేశారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో స్పీకర్ సభను పన్నెండు గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభను లోక్‌పాల్ అంశం కుదిపేసింది. దీంతో చైర్మన్ సభను గంటపాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications