ఎవరిదా అస్థిపంజరం?: జయలలిత గెస్ట్ హౌజ్‌లో కలకలం..

బంగ్లాలో సెక్యూరిటీగా పనిచేసిన వ్యక్తి అవశేషాలుగా వీటిని గుర్తించారు.ఆస్తి వ్యవహారంలో భాగంగా ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

టీనగర్: తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన సిరుతాపూర్ బంగ్లా వద్ద అస్థిపంజరం బయటపడటం కలకలం రేపుతోంది. ఒకప్పుడు జయలలిత గెస్ట్ హౌజ్ గా ఉన్న ఈ ఇల్లు ప్రస్తుతం శశికళ బంధువులైన మన్నార్ గుడి మాఫియా చేతిలో ఉంది. జయలలిత మరణం తర్వాత ఇక్కడ పోలీసు కాపలా తీసేశారు. ప్రస్తుతం సాయుధ పోలీసులు మాత్రమే ఇక్కడ గస్తీ కాస్తున్నారు.

సిరుతాపూర్ బంగ్లా వెనుకాల సోమవారం బయటపడిన అస్తిపంజరాన్ని.. బంగ్లాలో సెక్యూరిటీగా పనిచేసిన వ్యక్తిదిగా గుర్తించారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. చెన్నై నగరానికి సుమారు 70-80కి.మీ దూరంలో ఉన్న ఈ బంగ్లాకు జయలలిత అప్పుడప్పుడు విడిది కోసం వచ్చేవారు.

skeleton found at jayalalithaas guest house

ఆమె మరణానంతరం మన్నార్ గుడి మాఫియా చేతుల్లోకి ఈ బంగ్లా వెళ్లింది. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత దినకరన్ కుటుంబ సభ్యులు అందులోనే ఉంటూ బంగ్లాను చూసుకుంటున్నారు. గత ఏప్రిల్ లో ఈ భవనంలో భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. జయలలిత ఆస్తులకు సంబంధించిన పలు విలువైన పత్రాలు ఈ బంగ్లాలో ఉండటంతో.. అగ్ని ప్రమాదంపై అప్పట్లో అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+