షాకింగ్: స్నాప్‌డీల్ నుంచి 80 శాతం మంది ఉద్యోగులు ఔట్!

ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ తన సంస్థ నుంచి 80 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి పేపర్ వర్క్ ప్రారంభించాలని సంబంధిత విభాగాల హెడ్స్‌కు ఆదేశాల

బెంగళూరు: ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ తన సంస్థ నుంచి 80 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి పేపర్ వర్క్ ప్రారంభించాలని సంబంధిత విభాగాల హెడ్స్‌కు ఆదేశాలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది.

గతేడాది 9 వేల మంది ఉద్యోగులు కలిగిన స్నాప్‌డీల్ తర్వాత తమ ఉద్యోగుల సంఖ్యను 1200కు తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్‌తో విలీనం వార్తలతో తమకు ఎటువంటి ఢోకా లేదని భావించిన ఉద్యోగులకు తాజా నిర్ణయం షాకిచ్చింది.

Snapdeal undergoing major layoff, to slash 80 per cent workforce

మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌తో విలీనం నిలిచిపోయినట్టేనని స్నాప్‌డీల్ ప్రకటించింది. ఇక నుంచి సొంతంగానే ముందుకెళ్తామని స్నాప్‌డీల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఖర్చును బాగా నియంత్రించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైనట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+