ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం తక్కువే .. కారణమిదీ ?

హైదరాబాద్ : ఏ ఎన్నికల్లోనైనా గెలువాలంటే ప్రచారం తప్పనిసరి. అయితే క్యాంపెయిన్ తీరు మారుతోంది. గతంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కీ రోల్ పోషిస్తే .. ఇప్పుడది సోషల్ మీడియాకు చేరింది. ముఖ్యంగా యువతకు పేపర్ చదివే ఓపిక లేదు .. టీవీలో వార్తలు చూసే సమయం లేదు. వారి వెన్నంటే ఉంటోన్న ఫోన్ .. అందులో వాట్సాప్, ఫేస్ బుక్ పోస్టుల ద్వారా ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయగలుగుతారు.

 5 శాతమే .. ఎందుకంటే ...?

5 శాతమే .. ఎందుకంటే ...?

ఇంతవరకు ఓకే. కానీ సోషల్ మీడియా ప్రభావం తక్కువేనని బాంబ్ పేల్చారు ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ వో మోహన్ దాస్ అదేంటి గత ఎన్నికల్లో మోదీ సోషల్ మీడియాను ఉపయోగించి .. ప్రధాని పదవీ చేపట్టారని ప్రశ్నిస్తే .. ప్రస్తుత పరిస్థితిలో కేవలం 5 శాతం మాత్రమే సోషల్ మీడియా ద్వారా ప్రభావం చూపగలరని స్పష్టంచేశారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారు. తొలిసారి ఓటర్లుగా పేరు నమోదుచేసుకున్న వారు సోషల్ మీడియాలో ఎక్కువగా ఉన్నారని, సమాచారం కోసం వారు సోషల్ మీడియాపైనే ఆధారపడతారని పేర్కొన్నారు. యువత ఎక్కువ ఉండి, తొలిసారి ఓటు వేసేవారు అధికసంఖ్యలో ఉంటేనే కొంతమేర ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

మోదీకి క్రేజ్ .. రాహుల్ ఆకట్టుకోకపోవడానికి కారణమిదీ ?

మోదీకి క్రేజ్ .. రాహుల్ ఆకట్టుకోకపోవడానికి కారణమిదీ ?

ఆ 5 శాతం ఓటర్లను ఆకట్టుకోవడంతో బీజేపీ ముందంజలో ఉందని మోహన్ దాస్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ పేరుకు యువతలో క్రేజ్ ఉందన్నారు. ఈ విషయంలో రాహుల్ వెనుకబడి ఉన్నారని చెప్పారు. ఆయన ఇంకా 1990 భాషనే మాట్లాడటంతో యువతలో రాహుల్ పట్ల అంతగా ఆసక్తి కలగడం లేదని పేర్కొన్నారు.

ఇంట్రెస్ట్ .. పాజిటివ్ ... ఫ్యూచర్ .. ఇదీ సంగతి

ఇంట్రెస్ట్ .. పాజిటివ్ ... ఫ్యూచర్ .. ఇదీ సంగతి

యువత ముఖ్యంగా మెసేజ్ లపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. రాజకీయ పార్టీలు పెట్టే సందేశం గ్రూపులకు చేరేలా ఉండాలి. పాజిటివ్ గా ఉంటేనే చూస్తారు. ముఖ్యంగా వారి భవిస్యత్ పై ఆవలు కలిగించేట్టు ఉంటే అట్రాక్ట్ అవుతారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాను ఎలా చూస్తారు అని మెసేజ్ పెడితే యువతలో ఆసక్తిగా ఉంటుంది. విదేశాల్లో పనిచేసేందుకు వారు ఇంట్రెస్ట్ చూపిస్తారని పేర్కొన్నారు దాస్.

అంచనాపై ఆందోళన ?

అంచనాపై ఆందోళన ?

ఎన్నికల్లో ఆకట్టుకోవాలంటే పార్టీలకున్న ప్రధాన ప్రసార మాద్యమం సోషల్ మీడియానే. యువతతతోపాటు మహిళలు, రైతులకు చేరువయ్యేందుకు రాజీకయ పార్టీలు కసరత్తు చేస్తుంటే .. మోహన్ దాస్ అంచనా ఆయా పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+