ఉగ్రనేత కొడుకును కాపాడిన ఇండియన్ ఆర్మీ

శ్రీనగర్: పాంపోర్ ఎన్‌కౌంటర్ నుంచి ఉగ్రనేత కొడుకును భద్రతా బలగాలు కాపాడాయి. గతవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పులు సందర్భంగా 100 మందిని భద్రతా దళాలు రక్షించాయి. వీరిలో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ అగ్రనేత సయ్యద్ సలావుద్దీన్(70) కుమారుడు సయ్యద్ మొయిన్ ఉన్నాడు.

ఇతడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌(ఈడీఐ)లో మొయిన్ ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సలావుద్దీన్ ముగ్గురు కొడుకుల్లో మొయిన్ ఒకడని, అతడికి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు లేవని పోలీసులు తెలిపారు.

అయితే ఈడీఐపై ఉగ్రవాదుల దాడి తర్వాత మొయిన్‌ను పోలీసులు ప్రశ్నించినట్టు వార్తలు వచ్చాయి. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు గత శనివారం మధ్యాహ్నం శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్ మీద దాడి చేసి.. సమీపంలోని ఈడీఐ భవంతిలోకి చొరబడిన విషయం విదితమే.

Son Of Hizbul Chief Syed Salahuddin Saved By Forces In Pampore Attack

మూడు రోజుల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు, ఐదుగురు భద్రతా సిబ్బందితోపాటు ఒక సాధారణ పౌరుడు కూడా మృతి చెందారు.

కాగా, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన సయ్యద్ సలావుద్దీన్ జమ్మూకాశ్మీర్‌లో అనేకమార్లు భారత సైన్యంపై దాడులకు తెగబడ్డాడు. చాలా ఉగ్రవాద సంస్థలతో అతనికి సంబంధాలు ఉన్నాయి. కాగా, ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో తమ తండ్రికి దూరంగా ఉంటున్నారు అతని కుమారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+