వివాదాల్లో చిక్కుకున్న సోనియా గాంధీ
Sonia Gandhi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి, పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తూ దేశ రాష్ట్రపతిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇదివరకు ఇచ్చిన ప్రసంగాన్ని ఉద్దేశించి సోనయా గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని పేద మహిళ అంటూ వివాదానికి తెర లేపారు. అధ్యక్షురాలు తన ప్రసంగం పాఠాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయారని, అలసిపోయారని అన్నారు. పూర్ అంటూ పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రాష్ట్రపతి కార్యాలయం దీన్ని ఖండించింది. రాష్ట్రపతి పదవికి ఉన్న గౌరవానికి భంగం కలిగించేలా సోనియాగాంధీ చేసిన ఈ వ్యాఖ్యల చేశారని పేర్కొంది. అట్టడుగు వర్గాలు, రైతుల ప్రతినిధి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన అభ్యంతరాలు, ఆందోళనలను వ్యక్త పరిచారని తెలిపింది. పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న నిబద్ధత ఎప్పటికీ అలసిపోదు.. అని రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.
ఈ వ్యాఖ్యల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఘాటు విమర్శలు చేశారు. మొట్ట మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిని, ఓ సాధారణ మహిళలను ప్రత్యక్షంగా అవమానించడమేనంటూ మండిపడ్డారు. రాచరిక కుటుంబానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని బహిరంగంగా అగౌరవపరిచిందని వ్యాఖ్యానించారు.
గిరిజన వర్గాల పట్ల పార్టీకి ఉన్న తన వ్యతిరేక భావజాలాన్ని సోనియా గాంధీ బయటపెట్టారని మోదీ ధ్వజమెత్తారు. ఆదివాసీలు, గిరిజనులు, పేదరికం నుంచి అత్యుత్తమ స్థానాలను అందుకున్న వాళ్లపై తనకు ఉన్న దీర్ఘకాల పక్షపాత వైఖరిని సోనియా గాంధీ బయటపెట్టుకున్నారని మండిపడ్డారు.
గిరిజనుల ప్రయోజనాలను విస్మరించడం, ఆదివాసీ వీరులను గుర్తించడంలో విఫలం కావవడం, ఈ వర్గాల కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. గిరిజన హక్కుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన ట్రాక్ రికార్డ్‌కు- తాజాగా ద్రౌపది ముర్ముపై సోనియా చేసిన వ్యాఖ్యలు అద్దం పట్టినట్టయిందనే విమర్శలు ఉన్నాయి.
గత ఏడాది జులైలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి కూడా ద్రౌపది ముర్ముపై ఇలాంటి వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే. ఆమెను రాష్ట్రపత్నిగా సంబోధించారు. రాష్ట్రపతి హోదాను అవమానించారు. ఆయన వ్యాఖ్యలు.. పార్టీ భూస్వామ్య, జాత్యహంకార దృక్పథాన్ని బహిర్గతం చేశాయంటూ అప్పట్లో విమర్శలు తలెత్తాయి.
రాష్ట్రపతి ఇతర ఆధిపత్య కుటుంబం నుంచి వచ్చినట్లయితే కాంగ్రెస్ ఇలాంటి అగౌరవ వ్యాఖ్యలు చేసి ఉండేదా? అనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఓ గిరిజన మహిళ.. దేశంలో అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవిని అధిష్ఠించడాన్ని కాంగ్రెస్ ఎప్పటికీ అంగీకరించదనే అభిప్రాయాలను కలిగించినట్టయింది.












Click it and Unblock the Notifications