ఇస్రోతో జతకట్టడం ద్వారా రైల్వేలో మెరుగైన భద్రత: పీయూష్ గోయల్
రైల్వేలో భద్రత ప్రమాణాలను పెంచడం తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు.
న్యూఢిల్లీ: రైల్వేలో ప్రమాదాల నియంత్రణకు సాటిలైట్ వ్యవస్థను వినియోగించాలని రైల్వే శాఖ భావిస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీనిపై స్పందించారు.
రైల్వేలో భద్రత ప్రమాణాలను పెంచడం తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ఇందుకోసం సాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించుకోబోతున్నామని తెలిపారు. రైల్వేమంత్రిగా తన ఫోకస్ అంతా భద్రతా మీదే కేంద్రీకరించానని, ప్రయాణికుల భద్రతతో పాటు రైల్వో స్టేషన్లు, బోగిల్లో సీసీటీవి కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.
'ఇస్రో(ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్), రైల్ టెక్ మరియు ఇండియన్ రైల్వేస్ కలిసి పనిచేయాలని భావిస్తున్నాం. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు స్పేస్ టెక్నాలజీ ఉపయోగపడుతుందనుకుంటున్నాం. భారతీయ రైల్వేల్లో భద్రతా ప్రమాణాలు పెంపొందించడం మా తక్షణ కర్తవ్యం' అని గోయల్ చెప్పారు.

ఇస్రోతో పాటు సాఫ్ట్ వేర్ దిగ్గజం గూగుల్ తోను తాము కలిసి పనిచేయబోతున్నట్లు తెలిపారు. దేశంలోని 400రైల్వే స్టేషన్లలో వైఫై కనెక్టివిటీ కోసం వారిని సంప్రదిస్తున్నట్లు చెప్పారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్), ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్(టీటీఈ)లు విధుల్లో ఉన్నప్పుడు కచ్చితంగా యూనిఫామ్ ధరించాలని గోయల్ సూచించారు. రైల్వే సామర్థ్యాన్ని పెంచడంతో పాటు సాధ్యమైనంత మేర ఆదాయాన్ని పెంచడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications