సమాచారాన్ని దొంగిలించే అవకాశం జాగ్రత్త: ఆధార్ సిఈఓ
న్యూఢిల్లీ: ప్లాస్టిక్ లేదా పివిసి ఆధార్ కార్డులకు దూరంగా ఉండాలని యూఐడిఏఐ ప్రజలను మంగళవారం నాడు హెచ్చరించింది.ప్లాస్టిక్ లేదా పివిసి ఆధార్ స్మార్ట్ కార్డులను తయారు చేసే వారు ఆధార్ కార్డు యజమాని సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని యూఐడిఏఐ హెచ్చరించింది.
కొందరు ఆధార్ కార్డులను తయారు చేసి రూ.50 నుండి రూ.300లకు విక్రయిస్తున్నారని యూఐడిఏఐ అభిప్రాయపడింది.ఆధార్ కార్డు, ఈ ఆధార్, ఎంఆధార్ కూడ చెల్లుబాటు అవుతోందని యూఐడిఏఐ సిఈఓ అజయ్ భూషణ్ పాండే ప్రకటించారు.

ప్లాస్టిక్, లామినేషన్ ఆధార్ కార్డు మాత్రమే చెల్లుబాటు అవుతాయనే అపోహలు అవసరం లేదని అజయ్ ప్రజలకు సూచించారు.ఎవరైనా తమ ఆధార్ కార్డును పోగొట్టుకొంటే https://eaadhaar.uidai.gov.in.ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అజయ్ ప్రకటించారు.స్మార్ట్ ఆధార్ , ప్లాస్టిక్ ఆధార్ అనే ప్రత్యేక ఆధార్‌లు లేవని ఆయన స్పష్టత ఇచ్చారు.












Click it and Unblock the Notifications